Instant Murmure Sponge Dosa : మ‌ర‌మ‌ర‌లాతో ఎంతో మెత్త‌ని స్పాంజ్ దోశ‌.. 10 నిమిషాల్లో ఇలా వేసుకోవ‌చ్చు..!

Instant Murmure Sponge Dosa : మ‌నం మ‌ర‌మ‌రాల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో వివిధ ర‌కాల స్నాక్స్ ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. మర‌మ‌రాల‌తో చేసే చిరుతిళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. అయితే త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు మ‌ర‌మ‌రాల‌తో మ‌నం దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌ర‌మ‌రాల‌తో చేసే ఈ దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఇన్ స్టాంట్ గా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ దోశ‌ల‌ను 20 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు అలాగే వెరైటీగా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా మ‌ర‌మ‌రాల‌తో దోశ‌ల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ముర్ మురే స్పాంజ్ దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ముర్ మురే స్పాంజ్ దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మ‌ర‌మ‌రాలు – 2 క‌ప్పులు, ఉప్మా రవ్వ – ఒక క‌ప్పు, పెరుగు – అర క‌ప్పు, నీళ్లు – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, బేకింగ్ పౌడ‌ర్ – అర టీ స్పూన్.

Instant Murmure Sponge Dosa recipe in telugu make in this method
Instant Murmure Sponge Dosa

ముర్ మురే స్పాంజ్ దోశ త‌యారీ విధానం..

ముందుగా మ‌ర‌మ‌రాల‌ను ఒక గిన్నెలోకి తీసుకుని త‌గినన్ని నీళ్లు పోసి 15 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఒక గిన్నెలో ఉప్మా ర‌వ్వ‌, పెరుగు, నీళ్లు పోసి క‌ల‌పాలి. ఈ ర‌వ్వ‌ను కూడా 15 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత మ‌ర‌మ‌రాల‌ను వ‌డ‌క‌ట్టి జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే నాన‌బెట్టిన ర‌వ్వ‌ను కూడా నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, వంట‌సోడా త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌లుపుకోవాలి. త‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. త‌రువాత నూనె వేసి టిష్యూ పేప‌ర్ తో తుడుచుకోవాలి. త‌రువాత పిండిని తీసుకుని దోశ‌లాగా వేసుకోవాలి. దోశ త‌డి ఆరిన త‌రువాత నూనె వేసి కాల్చుకోవాలి. దీనిని రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ముర్ మురే దోశ త‌యార‌వుతుంది. దీనిని చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా అప్ప‌టిక‌ప్పుడు మ‌ర‌మ‌రాల‌తో దోశ‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts