Instant Ragi Dosa : రాగి దోశ‌ల‌ను ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు ఇలా చేసుకోవ‌చ్చు..!

Instant Ragi Dosa : రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఎముక‌ల‌ను ధృడంగా చేయ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా రాగులు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో రాగి దోశ‌లు కూడా ఒక‌టి. రాగి దోశలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అలాగే ఈ దోశ‌ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఇన్ స్టాంట్ గా అప్ప‌టిక‌ప్పుడు ఈ దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఉద‌యం స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఈ దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ రాగి దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ స్టాంట్ రాగి దోశ‌ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

రాగిపిండి – ఒక క‌ప్పు, బియ్యంపిండి – అర క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, అల్లం తురుము – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, చిలికిన పెరుగు – అర క‌ప్పు.

Instant Ragi Dosa recipe in telugu make in this method
Instant Ragi Dosa

ఇన్ స్టాంట్ రాగి దోశ‌ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో రాగిపిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ ప‌లుచ‌గా క‌లుపుకోవాలి. త‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక నూనె వేసి తుడుచుకోవాలి. త‌రువాత పిండిని మ‌రోసారి క‌లుపుకుని ర‌వ్వ దోశ మాదిరి వేసుకోవాలి. త‌రువాత దీనిని నూనె వేస్తూ రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఇన్ స్టాంట్ రాగి దోశ‌ త‌యార‌వుతుంది. దీనిని చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా రాగిపిండితో దోశ‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts