IPL 2022 : ముంబైలోని వాంఖెడె స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2022 టోర్నీ మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. చెన్నై జట్టు తక్కువ స్కోరు చేసినప్పటికీ కోల్‌కతా దాన్ని ఆచితూచి ఆడుతూ ఛేదించింది. ఈ క్రమంలోనే చెన్నెపై కోల్‌కతా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా చెన్నై బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలోనే చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 131 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌లలో ధోనీ (50 పరుగులు నాటౌట్) ఒక్కడే రాణించాడు. మిగిలిన ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఇక కోల్‌కతా బౌలర్లలో ఉమేష్ యాదవ్ 2 వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, ఆండ్రు రస్సెల్‌లు చెరొక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా ఆచి తూచి ఆడింది. 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్లను కోల్పోయి 133 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లలో ఆజింక్యా రహానే (44 పరుగులు) ఆకట్టుకున్నాడు. మిగిలిన ఎవరూ పెద్దగా రాణించలేదు. ఇక చెన్నై బౌలర్లలో డ్వానె బ్రేవో 3 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ శాన్టనర్ 1 వికెట్ తీశాడు.