Iyengar Pulihora : పులిహోర వెరైటీ.. అయ్యంగార్ పులిహోర‌.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..

Iyengar Pulihora : మ‌న‌లో ఉద‌యం చాలా మంది చేసే బ్రేక్‌ఫాస్ట్‌ల‌లో పులిహోర కూడా ఒక‌టి. దీన్ని ర‌క‌ర‌కాలుగా చేస్తుంటారు. చింత‌పండు, నిమ్మ‌కాయ‌, మామిడికాయ‌, ఉసిరికాయ‌.. ఇలా భిన్న ర‌కాల ప‌దార్థాలతో చేస్తుంటారు. ఇక ఆల‌యాల్లో ప్ర‌సాదంగా అందించే పులిహోర కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే ఇవే కాదు.. పులిహోర‌లో ఇంకా ఎన్నో వెరైటీలు ఉన్నాయి. వాటిల్లో అయ్యంగార్ పులిహోర కూడా ఒక‌టి. దీన్ని చేయ‌డం కూడా సుల‌భ‌మే. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అయ్యంగార్ పులిహోర‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అయ్యంగార్ పులిహోర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అన్నం – పావు కిలో, ప‌ల్లీలు – రెండు టీస్పూన్లు, నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు, చింత‌పండు – పెద్ద నిమ్మ‌కాయంత‌, క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు, ఆవాలు, మిన‌ప ప‌ప్పు, ధ‌నియాలు, నువ్వులు, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీస్పూన్ చొప్పున‌, ఎండు మిర్చి – 6, ప‌సుపు – ఒక టీస్పూన్‌, ఇంగువ – కొద్దిగా, ఉప్పు – స‌రిప‌డినంత‌.

Iyengar Pulihora recipe in telugu know how to make it
Iyengar Pulihora

అయ్యంగార్ పులిహోర‌ను త‌యారు చేసే విధానం..

చింత‌పండును వేడి నీళ్ల‌లో నాన‌బెట్టి ర‌సం తీసుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి. క‌డాయిలో కొంచెం నూనె వేసి వేడి చేసి ఎండు మిర్చి, నువ్వులు, శ‌న‌గ‌ప‌ప్పు, ధ‌నియాలు, మిరియాలు వేసి దోర‌గా వేయించాలి. చ‌ల్లారిన త‌రువాత వీటిని మెత్త‌గా పొడి చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి. మ‌ళ్లీ క‌డాయిలో కొద్దిగా నూనె పోసి వేడి చేసి ఆవాలు, నువ్వులు, శ‌న‌గ‌ప‌ప్పు, ఇంగువ‌, ఎండు మిర్చి, క‌రివేపాకు వేసి చివ‌ర్లో చింత‌పండు ర‌సం పోయాలి. దీంట్లో కొంచెం ఇంగువ‌, ఉప్పు వేయాలి.

పులుసు కాస్త ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన త‌రువాత దించి ప‌క్క‌న పెట్టాలి. క‌డాయిలో చిటికెడు నూనె పోసి వేడి చేసి ప‌ల్లీలు, క‌రివేపాకు వేయాలి. దీంట్లో అన్నం వేసి త‌రువాత చింత పండు పేస్టు, మిక్సీ ప‌ట్టిన పొడి వేసి క‌ల‌పాలి. చివ‌ర‌గా స‌రిప‌డినంత ఉప్పు క‌లిపితే స‌రిపోతుంది. దీంతో ఎంతో రుచిగా ఉండే అయ్యంగార్ పులిహోర రెడీ అవుతుంది. త‌ర‌చూ చేసుకుని రొటీన్ పులిహోర‌కు బ‌దులుగా ఇలా అయ్యంగార్ పులిహోర‌ను చేసి తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Editor

Recent Posts