Curry Leaves Drink : వీటిని మ‌రిగించి రోజూ ప‌ర‌గ‌డుపునే తాగండి.. షుగ‌ర్ అదుపులోకి వ‌స్తుంది..

Curry Leaves Drink : ఇటీవ‌లి కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. ఈ వ్యాధి బారిన ప‌డిన వారు ప్ర‌తి కుటుంబంలో ఒక్క‌రైన ఉంటున్నారు. ఈ షుగ‌ర్ వ్యాధి ప్ర‌స్తుత కాలంలో స‌ర్వ‌సాధార‌ణ‌మైన వ్యాధిగా మారిపోయింద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. శ‌రీరంలో క్లోమ గ్రంథి స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ వ్యాధి తలెత్తుతుంది. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, మాన‌సిక ఒత్తిడి ఈ వ్యాధి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అలాగే వంశ‌పార‌ప‌ర్యంగా కూడా కొంద‌రు ఈ వ్యాధి బారిన ప‌డుతుంటారు. షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా మ‌న‌కు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం కూడా ఉంది.

జీవ‌న విధానంలో అలాగే ఆహార‌పు అల‌వాట్ల‌ల్లో కొన్ని మార్పులు చేసుకోవడం వ‌ల్ల మ‌నం ఈ షుగ‌ర్ వ్యాధిని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు. ఇవే కాకుండా మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో క‌షాయాన్ని చేసుకుని తీసుకోవడం వ‌ల్ల కూడా మ‌నం షుగ‌ర్ వ్యాధిని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు. షుగ‌ర్ వ్ఆయ‌ధితో బాధ‌ప‌డే వారికి ఈ క‌షాయం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. షుగ‌ర్ వ్యాధిని నియంత్రించే ఈ క‌షాయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి. నీళ్లు వేడ‌య్యాక ఇందులో ఒక టీ స్పూన్ మెంతుల‌ను వేయాలి. త‌రువాత ఇందులో రెండు రెమ్మ‌ల క‌రివేపాకును, ఒక చిన్న అల్లం ముక్క‌ను వేయాలి.

take Curry Leaves Drink on empty stomach to control blood sugar levels
Curry Leaves Drink

చివ‌ర‌గా ఇందులో ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క‌ను వేయాలి. త‌రువాత ఈ నీటిని ఒక గ్లాస్ క‌షాయం అయ్యే వ‌ర‌కు బాగా మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. ఇలా త‌యారు చేసుకున్న క‌షాయాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి. దీనిని తీసుకున్న త‌రువాత అర గంట వ‌ర‌కు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడ‌దు. ఈ విధంగా క‌షాయాన్ని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అంతేకాకుండా ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి వ‌ల్ల క‌లిగే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. దీనిని తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉండ‌డంతో పాటు భ‌విష్య‌త్తులో కూడా రాకుండా ఉంటుంది.

D

Recent Posts