Janhvi Kapoor : గత కొద్ది నెలలుగా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగు వెండి తెర టాలీవుడ్‌కు పరిచయం అవుతుందని జోరుగా వార్తలు వచ్చాయి. ఆమె టాలీవుడ్‌లో ఎన్‌టీఆర్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తుందని ప్రచారం చేశారు. అయితే ఆ వార్తలను అబద్ధమని కొట్టి పారేశారు. కానీ ఇప్పుడు అవే నిజమయ్యాయి. జాన్వీ కపూర్ ఎట్టకేలకు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుందని ఆమె తండ్రి బోనీ కపూర్ కన్‌ఫామ్ చేశారు.
జాన్వీ కపూర్ త్వరలోనే ఎన్టీఆర్‌తో కలిసి ఓ సినిమాలో నటించనుందని ఆయన తెలిపారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రానున్న సినిమాలో ఆమె నటిస్తుందని తెలిపారు. దీంతో గత కొద్ది రోజులుగా వస్తున్న పుకార్లే నిజమయ్యాయి. సోషల్ మీడియా అనేది చాలా వింతైన ప్లేస్. ప్రతి రోజూ కొత్త కొత్త పుకార్లు వస్తుంటాయి. జాన్వీ, ఎన్‌టీఆర్‌లు కలిసి నటిస్తారనే వార్త కూడా పుకారులా ప్రచారం అయింది. అయితే చివరకు అదే నిజం అయింది.
జాన్వీ.. విజయ్ దేవరకొండతో కలిసి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న సినిమాలో నటిస్తుందని అన్నారు. కానీ ఆమె ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తుందని బోనీ కపూర్ కన్‌ఫామ్ చేశారు. దీంతో ఆమె తెలుగులో ఎప్పుడు కనిపిస్తుందా.. అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.