Jonna Tomato Bath : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన జొన్న ట‌మాటా బాత్‌.. త‌యారీ ఇలా..!

Jonna Tomato Bath : జొన్న‌ ట‌మాట బాత్.. జొన్న ర‌వ్వ‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. షుగ‌ర్ తో బాధ‌ప‌డే వారు, అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ జొన్న ట‌మాట బాత్ ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే జొన్న ట‌మాట బాత్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జొన్న‌ ట‌మాట బాత్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

జొన్న ర‌వ్వ – ఒక టీ గ్లాస్, నూనె – 2 టీ స్పూన్స్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, త‌రిగిన ఉల్లిపాయ -1, అల్లం తురుము – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ట‌మాటాలు – 2, ఉప్పు – త‌రిగినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ప‌చ్చి బ‌ఠాణీ – పావు క‌ప్పు, నీళ్లు – 4 టీ గ్లాసులు.

Jonna Tomato Bath recipe in telugu very healthy and tasty
Jonna Tomato Bath

జొన్న ట‌మాట బాత్ త‌యారీ విధానం..

ముందుగా జొన్న ర‌వ్వ‌ను శుభ్రంగా క‌డిగి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మిన‌ప‌ప్పు, శ‌న‌గ‌ప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత జీడిప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదూ నూనెలో ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు, బ‌ఠాణీ, క్యారెట్ ముక్క‌లు, అల్లం త‌రుగు, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌గ్గించాలి. ట‌మాట ముక్క‌లు మ‌గ్గిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత ర‌వ్వ వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ర‌వ్వ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. ర‌వ్వ ఉడికిన త‌రువాత వేయించిన తాళింపు దినుసులు, కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న ట‌మాట బాత్ త‌యార‌వుతుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts