వినోదం

Kajal Aggarwal : కాజ‌ల్ ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవుతారు.. చందమామ బాగానే వెనకేసుకుందిగా..!

Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యింది. ఇక ఆ సినిమా తర్వాత వెనుతిరిగి చూడలేదు కాజల్. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేరుకుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉండగానే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. అంతేకాదు ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

బిడ్డకు జన్మ నిచ్చిన తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన కాజల్ ఇపుడు వరుసగా సినిమాలు చేయడానికీ ఓకే చెబుతోంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ హీరోగా వ‌స్తోన్న ఇండియ‌న్ 3 సినిమా షూటింగ్లో కాజ‌ల్ పాల్గొంటోంది. ప‌దేళ్ల పాటు తెలుగులో స్టార్ స్టేట‌స్ ఎంజాయ్ చేయ‌డంతో పాటు త‌మిళ్‌, బాలీవుడ్‌లోనూ న‌టించిన కాజ‌ల్ బాగానే ఆస్తులు కూడబెట్టుకుంది. ఇక కాజ‌ల్ రెమ్యున‌రేష‌న్ల‌తో ఏకంగా రూ. 100 కోట్ల‌కు పైగా ఆస్తులు సంపాదించింది. అయితే ఆమె కొన్న స్థిరాస్తుల విలువ ఇప్పుడు భారీగా పెర‌గ‌డంతో ఆమె మొత్తం ఆదాయం చాలా ఎక్కువ‌గానే ఉండ‌నుంది.

kajal aggarwal net worth and properties value

హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుతో పాటు ముంబైలోనూ ఆమెకు ప్లాట్లు, ఖ‌రీదైన ల‌గ్జ‌రీ ఇళ్లు ఉన్నాయి. ఓ నేష‌న‌ల్ మీడియా వెబ్‌సైట్ క‌థ‌నం ప్ర‌కారం ఆమె వార్షికాదాయం రు. 6 కోట్లపై మాటే అట‌. ఓవ‌రాల్‌గా ఆమె చ‌రాస్తులే రూ. 100 కోట్లు ఉంటాయ‌ని.. స్థిరాస్తులు కూడా క‌లుపుకుంటే కాజ‌ల్ ఆస్తులు డ‌బుల్ ఉంటాయ‌ని టాక్! ఆమె ఖ‌రీదైన కార్లు వాడుతుంది. ఆమె వాడే కార్ల విలువే రు. 5 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ట‌. కాజ‌ల్ త‌న సంపాద‌న‌ను అనేక వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెట్టింది. ఇక ఆమె భ‌ర్త గౌత‌మ్ కిచ్లు కూడా ఇంటీరియ‌ర్ డిజైనింగ్ బిజినెస్‌తో బాగానే సంపాదిస్తున్నాడు.

Admin

Recent Posts