Kobbari Burelu : నోరూరించే కొబ్బ‌రి బూరెల‌ను ఇలా చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Kobbari Burelu : మ‌నం ప‌చ్చి కొబ్బ‌రిని ఉప‌యోగించి ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌చ్చి కొబ్బ‌రితో చేసే తీపి వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ప‌చ్చి కొబ్బ‌రితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో కొబ్బ‌రి బూరెలు కూడా ఒక‌టి. కొబ్బ‌రి బూరెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఒక్క‌సారి త‌యారు చేసుకుని 20 రోజుల పాటు తిన‌వ‌చ్చు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ కొబ్బ‌రి బూరెల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బ‌రి బూరెల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం – ఒక క‌ప్పు, ప‌చ్చికొబ్బ‌రి – అర క‌ప్పు, బెల్లం – ముప్పావు క‌ప్పు,నీళ్లు – 2 టీ స్పూన్స్, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Kobbari Burelu recipe in telugu very tasty everybody likes them
Kobbari Burelu

కొబ్బ‌రి బూరెల త‌యారీ విధానం..

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా క‌డిగి రాత్రంతా నాన‌బెట్టాలి. త‌రువాత నీటిని వ‌డ‌క‌ట్టి త‌డి పోయేలా ఆర‌బెట్టుకోవాలి. త‌రువాత ఈ బియ్యాన్ని జార్ లో వేసి మెత్త‌ని పిండిలా చేసుకోవాలి. త‌రువాత ఈ పిండిని జ‌ల్లెడ ప‌ట్టి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం క‌రిగిన త‌రువాత మ‌రో మూడు నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత యాల‌కుల పొడి, కొబ్బ‌రి తురుము వేసి క‌ల‌పాలి. త‌రువాత నెయ్యి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

త‌రువాత బియ్యంపిండి వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత కొద్దిగా పిండిని తీసుకుని పాలిథిన్ క‌వ‌ర్ మీద లేదా బ‌ట‌ర్ పేప‌ర్ మీద ఉంచి బూరెలాగా వ‌త్తుకోవాలి. త‌రువాత ఈ బూరెను నూనెలో వేసి కాల్చుకోవాలి. ఈ బూరెల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌రి బూరెలు త‌యార‌వుతాయి. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా కొబ్బ‌రితో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా బూరెల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts