Kobbari Rasam : కొబ్బరి పాలు.. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కొబ్బరి పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. కొబ్బరి పాలతో తరచూ చేసే వంటకాలతో పాటు మనం కొబ్బరి రసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. కొబ్బరి రసం చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి పాలతో కొబ్బరి రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరి పాలు – ఒక కప్పు, చింతపండు – చిన్న నిమ్మకాయంత, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఇంగువ – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ.
కొబ్బరి రసం తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, తాళింపు దినుసులు, పచ్చిమిర్చి, పసుపు వేసి వేడి చేయాలి. తరువాత ఇంగువ వేసి కలపాలి. తరువాత కొబ్బరి పాలు, ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించిన తరువాత చింతపండు రసం వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి రసం తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి పాలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కొబ్బరి రసాన్ని కూడా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తినడం వల్ల రుచితో పాటు మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.