Joint Pain Remedy : ఈ 3 పదార్థాలు తీసుకుంటే జాయింట్ల మధ్య‌ నుంచి వచ్చే శబ్దం, కీళ్ల నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి..!

Joint Pain Remedy : మోకాళ్ల నొప్పులు, న‌డిచేట‌ప్పుడు, కూర్చునేట‌ప్పుడు మోకాళ్ల నుండి శ‌బ్దం రావ‌డం, క్యాల్షియం లోపం, ఎముక‌లు బ‌ల‌హీనంగా ఉండ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో మ‌నలో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. పెద్ద వారే కాకుండా న‌డి వ‌య‌స్కులు కూడా ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది అనేక ర‌కాల మందుల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల తాత్కాలిక ఉప‌శ‌మ‌నం ఉన్న‌ప్ప‌టికి ఈ నొప్పులు మ‌ర‌లా వ‌స్తూ ఉంటాయి. ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గించి ఎముక‌ల‌ను ధృడంగా, బ‌లంగా మార్చే ఆయుర్వేద చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల నొప్పులు మ‌ర‌లా రాకుండా ఉంటాయి. దీని కోసం మ‌నం మూడు ర‌కాల ప‌దార్థాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ చిట్కా కోసం నిమ్మ‌కాయంత బెల్లాన్ని, అర క‌ప్పు పుట్నాల ప‌ప్పును, ఒక గ్లాస్ పాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే న‌ల్ల రంగులో ఉండే బెల్లాన్ని మాత్ర‌మే ఉప‌యోగించాల్సి ఉంటుంది. బెల్లంలో అధిక మొత్తంలో ఫాస్ప‌ర‌స్ ఉంటుంది. ఇది ఎముక‌ల‌ను బ‌లంగా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అదే విధంగా బెల్లాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. బెల్లాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే మ‌లినాల‌న్ని తొల‌గిపోతాయి. ర‌క్త‌హీన‌త సమ‌స్య మ‌న ద‌రి చేరుకుండా ఉంటుంది. అధిక ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. జీర్ణ‌శక్తి మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు మెరుగుప‌డుతుంది. రోజూ పుట్నాల ప‌ప్పును, బెల్లాన్ని క‌లిపి తిని ఒక గ్లాస్ వేడి పాల‌ను తాగ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గ‌డంతో పాటు మ‌రలా రాకుండా ఉంటాయి.

Joint Pain Remedy take these 3 foods daily
Joint Pain Remedy

మోకాళ్ల నొప్పులు త‌గ్గ‌డంతో పాటు మోకాళ్ల నుండి శ‌బ్దాలు రావ‌డం త‌గ్గుతుంది. అయితే వీటిని మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన రెండు గంట‌ల తరువాత బెల్లాన్ని, పుట్నాల ప‌ప్పును తిని పాల‌ను తాగాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మోకాళ్ల నొప్పులు త‌గ్గ‌డంతో పాటు జ్ఞాప‌క‌శ‌క్తి కూడా పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న‌ల మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోవ‌చ్చు. శ‌రీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. వీటితో పాటు మెంతుల‌ను కూడా నాన‌బెట్టి తీసుకోవాలి. రోజూ రాత్రి ప‌డుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ మెంతుల‌ను వేసి నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ఈ నీటిని మెంతుల‌తో స‌హా వేడి చేయాలి.

త‌రువాత ఈ నీటిని వ‌డ‌కట్టి టీ తాగిన‌ట్టు చ‌ప్ప‌రిస్తూ తాగాలి. ఈ విధంగా ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున మెంతుల నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. ఎముక‌లు బ‌లంగా, ఆరోగ్యంగా త‌యార‌వుతాయి. మెంతుల నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మోకాళ్ల నొప్పులు త‌గ్గ‌డంతో పాటు మ‌నం ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ విధంగా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతొఓ బాధ‌ప‌డే వారు ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా మోకాళ్ల నొప్పుల‌ను, కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

D

Recent Posts