Strawberry Milkshake : మనం రకరకాల రుచుల్లో మిల్క్ షేక్ లను తయారు చేస్తూ ఉంటాం. మిల్క్ షేక్స్ చల్ల చల్లగా చాలా రుచిగా ఉంటాయి. వేసవి కాలంలో వీటిని తాగడం వల్ల శరీరానికి మేలు కలగడంతో పాటు ఎండ నుండి ఉపశమనం కూడా కలుగుతుంది. అలాగే మనం మనకు నచ్చిన ఫ్రూట్స్ తో ఈ మిల్క్ షేక్ లను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా అందరికి నచ్చేలా స్ట్రాబెరీస్ తో మిల్క్ షేక్ ను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రాబెరీ మిల్క్ షేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
స్ట్రాబెరీ – 100 గ్రా., ఐస్ క్రీమ్ – ఒక కప్పు, కాచి చల్లార్చిన పాలు – 400 ఎమ్ ఎల్, ఐస్ క్యూబ్స్ – 4, పంచదార – 50 గ్రా..
స్ట్రాబెరీ మిల్క్ షేక్ తయారీ విధానం..
ముందుగా జార్ లో స్ట్రాబెరీ ముక్కలు వేసుకుని ఫ్యూరీ లాగా చేసుకోవాలి. తరువాత ఇందులో ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్స్, పాలు, పంచదార వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిని గ్లాస్ లో పోసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్ట్రాబెరీ మిల్క్ షేక్ తయారవుతుంది. సాయంత్రం సమయాల్లో ఇలా మిల్క్ షేక్ ను తయారు చేసుకుని తాగవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు. పిల్లలకు ఇలా స్ట్రాబెరీస్ తో మిల్క్ షేక్ చేసి ఇవ్వడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించవచ్చు.