ఆధ్యాత్మికం

బ్రహ్మ ముహూర్తంలో 48 రోజుల పాటు ఈ దీపం వెలిగిస్తే?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో లేదా దేవాలయంలో దీపారాధన చేయడం ఒక ఆచారంగా వస్తోంది.అయితే కొన్ని ప్రత్యేకమైన రోజులలో లేదా పర్వదినాలలో మనం ఆలయాలను దర్శించినప్పుడు ఆలయంలో ఉసిరి దీపం వెలిగించడం చూస్తుంటాము. అయితే ఉసిరి దీపం వెలిగించడం వెనుక ఉన్న కారణం ఎవరికీ తెలియదు.

ఉసిరి దీపం అంటే శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ప్రతి శుక్రవారం ఉదయం బ్రహ్మ ముహూర్తం లోని ఉసిరి దీపం వెలిగించడం వల్ల అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఈ క్రమంలోని ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం లో రెండు దీపాలలో 48 రోజులపాటు వెలిగించడం ద్వారా సకల సంపదలు కలుగుతాయి.

light this usiri deepam for 48 days

ఉసిరి కాయపై నేతితో చేసిన వత్తులను వెలిగించి పూజించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఈ విధంగా 48 రోజులపాటు వెలిగించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.అదే విధంగా ప్రతి శుక్రవారం అమ్మవారికి ఉసిరి దీపం వెలిగించడం ఎంతో శుభప్రదమని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts