vastu

House : ఏ రాశి వాళ్లకి.. ఏ దిక్కున‌ ఇంటి ప్ర‌ధాన ద్వారం ఉంటే కలిసి వస్తుంది..?

House : చాలామంది ఇంటిని నిర్మించేటప్పుడు ఏ దిశలో ఏం ఉండాలి అనేది కచ్చితంగా చూసుకుంటారు. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మిస్తే అంత మంచి జరుగుతుందని నమ్మకం. అయితే మరి ఏ రాశి వాళ్ళకి ఎలాంటి నియమాలు ఉన్నాయి అనేది తెలుసుకుందాం.. సాధారణంగా ఇంటి తలుపులు ఉత్తరం లేదా తూర్పు దిశ లో ఉంటే శుభం కలుగుతుంది. రాశుల ప్రకారం ఇంటి తలుపుల్ని ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇంటి యజమాని రాశి ని బట్టి ఇంటి ముఖద్వారం తో శుభ అశుభ ఫలితాలు కలుగుతాయి.

మేషరాశి వారికి తూర్పు ద్వారం ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మేషరాశి వాళ్లు ఇంటి గుమ్మాన్ని తూర్పు వైపు ఉండేటట్టు చూసుకోండి. వృషభ రాశి వారికి దక్షిణ ద్వారం కలిసి వస్తుంది దక్షిణ ద్వారా ఉంటే వాళ్ళకి మంచి ఫలితాలు అందుతాయి. మిధున రాశి వాళ్ళకి పశ్చిమ ద్వారం అనుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాలు కలుగుతాయి.

main door direction according to zodiac signs

కర్కాటక రాశి వారికి ఉత్తర ద్వారం బాగా కలిసి వస్తుంది. సింహ రాశి వాళ్ళకి తూర్పు ద్వారం కలిసి వస్తుంది. కన్యారాశి వాళ్లకు అయితే పశ్చిమ ద్వారం బాగా కలిసి వస్తుంది. తుల రాశి వాళ్ళకి దక్షిణ ద్వారం బాగా కలిసి వస్తుంది. కాబట్టి తుల రాశి వాళ్ళు అలా పాటిస్తే మంచిది. వృశ్చిక రాశి వాళ్ళకి అయితే ఉత్తర ద్వారం బాగా కలిసి వస్తుంది మంచి ఫలితాలని పొందొచ్చు. ధనస్సు రాశి వాళ్లకి అయితే తూర్పు ద్వారం బాగా కలిసి వస్తుంది.

మంచి ఫలితాలు పొందొచ్చు. ఇక మకర రాశి వాళ్ళకి అయితే దక్షిణ ద్వారం బాగా కలిసి వస్తుంది. మంచి ఫలితాలను పొందొచ్చు. కుంభ రాశి వాళ్ళకి పశ్చిమ ముఖంగా ఉన్న ఇంట్లో చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీన రాశి వాళ్లకైతే ఉత్తర ద్వారం బాగా కలిసి వస్తుంది.

Admin

Recent Posts