చక్కెర పొంగలి గుడిలో ప్రసాదంలా రావాలంటే.. ఇలా చేయాలి..!

మ‌నం త‌ర‌చూ వంటింట్లో ఏదో ఒక తీపి ప‌దార్థాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం చాలా సుల‌భంగా, చాలా త్వ‌ర‌గా చేసుకోగలిగే తీపి ప‌దార్థాల్లో చ‌క్కెర పొంగ‌లి కూడా ఒకటి. చ‌క్కెర పొంగ‌లి ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన పని లేదు. ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ చ‌క్కెర పొంగ‌లిని సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చ‌క్కెర పొంగ‌లి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెస‌ర పప్పు – పావు కిలో, బియ్యం – ముప్పావు క‌ప్పు, నీళ్లు – రెండున్న‌ర‌ క‌ప్పులు, ఉప్పు – చిటికెడు, చ‌క్కెర‌ – ఒక‌టిన్న‌ర క‌ప్పు, నెయ్యి – 4 టేబుల్ స్పూన్స్, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, జీడిప‌ప్పు – కొద్దిగా, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – కొద్దిగా, ఎండు ద్రాక్ష – కొద్దిగా.

make chakkera pongali in this method like temples

చ‌క్కెర పొంగ‌లి త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యిని పూర్తిగా క‌ర‌గ‌నివ్వాలి. త‌రువాత డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కుక్క‌ర్ లో పెస‌ర పప్పును వేసి రంగు మారే వ‌ర‌కు వేయించుకోవాలి. త‌రువాత ఇందులోనే బియ్యాన్ని కూడా వేసి నీళ్లు పోసి శుభ్రంగా క‌డుక్కోవాలి. త‌రువాత రెండు క‌ప్పుల నీళ్లను, ఉప్పును వేసి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. త‌రువాత మూత తీసి గంటెతో అన్నాన్ని మెత్త‌గా చేసుకోవాలి.

ఇప్పుడు మ‌రో గిన్నెలో చ‌క్కెర‌ను, అర క‌ప్పు నీళ్లను పోసి చ‌క్కెర‌ క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. చ‌క్కెర‌ పూర్తిగా క‌రిగి కొద్దిగా జిగురు వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని జ‌ల్లిగంటెతో వ‌డ‌క‌డుతూ ముందుగా ఉడికించిన అన్నంలో పోయాలి. త‌రువాత కుక్క‌ర్ ను స్ట‌వ్ మీద ఉంచి అన్నం, చ‌క్కెర‌ మిశ్ర‌మం పూర్తిగా క‌లిసేలా 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించాలి.

త‌రువాత యాల‌కుల పొడిని, ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే చ‌క్కెర పొంగ‌లి త‌యార‌వుతుంది. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఈ విధంగా చాలా సుల‌భంగా చ‌క్కెర పొంగ‌లిని చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ విధంగా చేసిన చ‌క్కెర పొంగ‌లిని దేవుడికి నైవేద్యంగా కూడా స‌మ‌ర్పించ‌వ‌చ్చు.

Share
D

Recent Posts