ప్రస్తుత కాలంలో మానసిక ప్రశాంతత లభించక బాధపడుతున్న వారు చాలా మందే ఉన్నారు. ఆర్థిక పరమైన కారణాల వల్ల, అనారోగ్య సమస్యల కారణంగా, కుటుంబంలో కలహాల కారణంగా, భార్యా భర్తల మధ్య సఖ్యత లేకపోవడం, సంతానం వృద్ధి చెందకపోవడం వంటి అనేక కారణాల వల్ల మనం మానసికంగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. మన ఇంటి వాస్తు కూడా ఈ సమస్యల బారిన పడడానికి కారణం అవుతుంది. ఇంటి వాస్తుకు ముఖ్యంగా నైరుతిలో జంట, ఆగ్నేయంలో వంట, ఈశాన్యంలో కుంట, వాయువ్యంలో పెంట అనే సామెత మనకు చాలా కాలం నుండి వాడుకలో ఉంది. ఈ విధంగానే మనం ఇంటిని నిర్మించుకోవాలి.
అదే విధంగా మనం నిద్రించే విధానం కూడా మనపై ప్రభావాన్ని చూపిస్తుంది. మనం నిద్రించేటప్పుడు తలను తూర్పు వైపుకు పెట్టుకుని నిద్రించడం వల్ల మనం విశేష ఫలితాలను పొందవచ్చు. పడమర వైపు తలను పెట్టి నిద్రించడం వల్ల మనం రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్కున తలను ఉంచి నిద్రించడం వల్ల మనం అథమస్థానంలో ఉండే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్కున మాత్రం తలను ఉంచి నిద్రించడం అనేది అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
అదే విధంగా ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ నిద్రలేచేటప్పుడు రెండు చేతులను చూసుకుంటూ తమ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ ఉత్తరం వైపుగా దిగి, తూర్పు వైపుగా గుమ్మాన్ని దాటి మనం రోజూ చేసుకునే పనులను చేసుకోవాలి. ఈ నియమాలను పాటించడం వల్ల ఆ రోజంతా మనకు మంచి జరుగుతుందని, మనం చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయని చెబుతున్నారు. ఈ నియమాలను పాటించడం వల్ల మనం అన్ని రకాలుగా ముందుకు వెళ్లగలుగుతామని నిపుణులు సూచిస్తున్నారు.