Ganesh Idols : గ‌ణేష్ విగ్ర‌హాల‌ను ఈ ఆహారాల‌తో చేసి చూడండి.. ఎంతో బాగుంటాయి..!

Ganesh Idols : ప్ర‌తి ఏడాది వినాయ‌క చ‌వితి వ‌స్తుందంటే చాలు.. భ‌క్తులంద‌రూ ఎంతో ఉత్సాహంగా పండుగ కోసం ఎదురు చూస్తుంటారు. అందులో భాగంగానే త‌మ త‌మ వాడ‌ల్లో మండ‌పాల‌ను ఏర్పాటు చేసి గ‌ణేష్ ఉత్స‌వాల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంటారు. ఇక ఈ ఏడాది కూడా వినాయ‌క చ‌వితికి అంద‌రూ సిద్ధ‌మ‌వుతున్నారు. చాలా మంది వివిధ ర‌కాల వినాయ‌క విగ్ర‌హాల‌ను పెట్టి పూజిస్తుంటారు. అనేక వినాయ‌క విగ్ర‌హాలు భ‌క్తుల‌ను అల‌రిస్తుంటాయి. అయితే వినాయ‌క విగ్ర‌హాల‌ను కేవ‌లం మ‌ట్టి, ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారిస్‌తోనే కాదు.. మనం రోజూ తినే ప‌లు ఆహారాల‌తోనూ చేయ‌వ‌చ్చు. ఏయే ప‌దార్థాల‌తో వినాయ‌కుల‌ను చేయ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

పండ్ల‌తో..

వివిధ ర‌కాల తాజా పండ్ల‌తోనూ గ‌ణేష్ విగ్ర‌హాల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. ముఖ్యంగా అర‌టి పండ్లు, యాపిల్స్‌, ద్రాక్ష వంటి వాటితో వినాయ‌కుల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. ఇవి చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. నిమ‌జ్జ‌నం చేయ‌డం కూడా చాలా సుల‌భం. క‌నుక ఈసారి ఇలా వినాయ‌కున్ని త‌యారు చేయండి.

make Ganesh Idols with these foods look attractive
Ganesh Idols

చాకొలెట్‌తో..

చాకొలెట్లు అంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి. ఇవంటే చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. అయితే చాకొలెట్ల‌తోనూ గ‌ణేష్ విగ్ర‌హాన్ని త‌యారు చేయ‌వ‌చ్చు. చాకొలెట్‌ను క‌రిగించి వినాయ‌కున్ని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఇది ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా కూడా ఉంటుంది. దీన్ని కూడా మీరు ట్రై చేయ‌వ‌చ్చు.

డ్రై ఫ్రూట్ గ‌ణేష్‌..

బాదం, జీడిప‌ప్పు, పిస్తా, వాల్ న‌ట్స్‌, కిస్మిస్‌.. ఇలా మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే గుమ్మ‌డికాయ విత్త‌నాలు, చియా సీడ్స్‌, పొద్దు తిరుగుడు విత్త‌నాలు కూడా ల‌భిస్తున్నాయి. వీట‌న్నింటిని ఉప‌యోగించి కూడా వినాయ‌క విగ్ర‌హాన్ని త‌యారు చేయ‌వ‌చ్చు. ఇవి కూడా ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. వీలైతే ఇలా కూడా గ‌ణేష్ విగ్ర‌హాన్ని త‌యారు చేసేందుకు ప్ర‌య‌త్నించండి.

ప‌సుపు..

ప‌సుపుకు భార‌తీయ సంప్ర‌దాయంలో ఉన్న ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. ఇది ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్య‌ప‌రంగా కూడా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. చాలా మంది పూజ‌ల్లో ప‌సుపుతో చేసిన గౌర‌మ్మ‌ల‌ను ఉప‌యోగిస్తారు. అయితే ప‌సుపుతో గ‌ణేషున్ని కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. ఇలా కూడా ఓసారి ప్ర‌య‌త్నం చేసి చూడండి.

కొబ్బ‌రి..

కొబ్బ‌రికాయ‌ల‌ను మ‌నం పూజ‌ల్లో ఉప‌యోగిస్తుంటాం. కొబ్బ‌రికాయను కొట్టి త‌మ కోరిక‌ల‌ను నెర‌వేర్చాల‌ని భ‌క్తులు భ‌గ‌వంతున్ని కోరుతుంటారు. ఇక కొబ్బ‌రిని మ‌నం వంటల్లోనూ ఉప‌యోగిస్తాం. అయితే కొబ్బ‌రి తీశాక మిగిలే కొబ్బ‌రి చిప్ప‌ల‌ను ప‌డేయ‌కండా వాటితోనూ గ‌ణేషున్ని త‌యారు చేయ‌వ‌చ్చు. క‌ళాత్మ‌క కోణం ఉండాలేకానీ అంద‌మైన గ‌ణేష్‌ల‌ను ఈ చిప్ప‌ల‌తో త‌యారు చేయ‌వ‌చ్చు. ఇలా కూడా ఓసారి చేయండి.

మోద‌కాలు..

వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా గ‌ణేషుడికి మ‌నం అనేక ర‌కాల పిండి వంట‌కాల‌ను నైవేద్యంగా స‌మ‌ర్పిస్తుంటాం. అయితే వాటిల్లో మోద‌కాలు కూడా ఒక‌టి. వీటిని ఉప‌యోగించి కూడా గ‌ణేష్ విగ్ర‌హాన్ని త‌యారు చేయ‌వ‌చ్చు. ఇవి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. ఇలా ఈ ప‌దార్థాల‌తో వినాయ‌కుల‌ను ఈసారి చేసి చూడండి. ప‌ర్యావ‌ర‌ణానికి కూడా మేలు చేసిన వారు అవుతారు. పైగా ఈ ప‌దార్థాల‌ను సుల‌భంగా నిమ‌జ్జ‌నం కూడా చేయ‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts