Masala Tea : ఈ సీజన్‌లో మనకు సహజంగానే అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. దగ్గు, జలుబు, జ్వరం ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. దీంతోపాటు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే వీటిని రాకుండా ముందుగానే నివారించవచ్చు. అందుకు మన వంట ఇంట్లో ఉండే పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని వాడి తయారు చేసే మసాలా టీని రోజుకు ఒక కప్పు తాగితే చాలు. మనకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. అలాగే ఆయా మసాలా పదార్థాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక మసాలా టీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా టీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – రెండు కప్పులు, మసాలా పొడి – ఒక టీస్పూన్, టీ పొడి, చక్కెర – రెండు టీస్పూన్ల చొప్పున, శొంఠి – రెండు చిన్న ముక్కలు, యాలకులు – 4, లవంగాలు – పావు టీస్పూన్, మిరియాలు – అర టీస్పూన్, దాల్చిన చెక్క – 4 చిన్న ముక్కలు, పాలు – ఒక కప్పు.
మసాలా టీని తయారు చేసే విధానం..
మసాలా దినుసులన్నింటినీ మిక్సీ పట్టుకుని పొడి తయారు చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాత్ర పెట్టి నీళ్లు పోసి మసాలా పొడి వేసి ఒక నిమిషం పాటు మరగనివ్వాలి. తరువాత టీపొడి వేసి 2 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత పాలు పోసి మరికాసేపు మరగబెట్టాలి. చక్కెర కూడా వేసి మళ్లీ 1 నిమిషం పాటు మరిగించాలి. తరువాత స్టఫ్ ఆఫ్ చేయాలి. దీంతో రుచికరమైన మసాలా టీ తయారవుతుంది. దీన్ని రోజుకు ఒక కప్పు తాగితే చాలు.. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.