Warm Water : ఈ సీజ‌న్‌లో గోరువెచ్చ‌ని నీళ్ల‌ను ప‌ర‌గ‌డుపున తాగాల్సిందే.. ఎందుకంటే..?

Warm Water : ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం సీజ‌న్ న‌డుస్తోంది. ఈ సీజ‌న్ లో మ‌న‌కు అనేక ర‌కాల వ్యాధులు వ‌స్తుంటాయి. వాటిల్లో జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు ప్ర‌ధాన‌మైన‌వి. ఇవి ఎక్కువ‌గా బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల కార‌ణంగా వ‌స్తాయి. దీంతోపాటు దోమ కుట్ట‌డం వ‌ల్ల డెంగ్యూ, మ‌లేరియా వంటి వ్యాధులు వ‌స్తాయి. అలాగే క‌లుషిత ఆహారం, నీరు తీసుకుంటే టైఫాయిడ్ వ‌స్తుంది. ఇలా అనేక ర‌కాల వ్యాధులు మ‌న‌పై దాడి చేసేందుకు ఈ సీజ‌న్‌లో సిద్ధంగా ఉంటాయి. క‌నుక మ‌నం ఈ సీజ‌న్‌లో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. ముఖ్యంగా ఆయా వ్యాధుల‌ను ఎదుర్కొనేలా శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాలి. దీంతో వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. అయితే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు వేడి నీళ్లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 2 లేదా 3 గ్లాసుల మోతాదులో తాగాలి. దీంతోపాటు రోజంతా కుదిరితే వేడి నీళ్ల‌నే తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

you should drink warm water on empty stomach in this season
Warm Water

రోజులో ఉద‌యం ప‌ర‌గ‌డుపున అలాగే రోజు మొత్తం గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా మారుతుంది. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఫ‌లితంగా అనేక వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. అలాగే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం రాకుండా ఉంటాయి. దీంతోపాటు శ‌రీర మెట‌బాలిజం కూడా పెరుగుతుంది. ఈ సీజ‌న్‌లో మ‌నం వ్యాయామం చేసేందుకు అనువుగా ఉండ‌దు. క‌నుక గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను రోజంతా తాగితే శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. ఫ‌లితంగా కొవ్వు క‌రుగుతుంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. ఇలా శ‌రీరాన్ని ఈ సీజ‌న్‌లో ఫిట్‌గా ఉంచుకోవ‌చ్చు.

గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ మొత్తం శుభ్రంగా మారుతుంది. పేగుల్లో ఉండే వ్య‌ర్థాలు సుల‌భంగా బ‌య‌ట‌కు వ‌స్తాయి. దీంతో అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల నుంచి విముక్తి ల‌భిస్తుంది. అలాగే కిడ్నీలు కూడా శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. హైబీపీ త‌గ్గుతుంది. ఇలా గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో అయితే ఈ నీళ్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తాగాల్సి ఉంటుంది. దీంతో వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

Editor

Recent Posts