Snake Gourd Curry : పొట్లకాయ అంటే ఇష్టం లేకుంటే.. ఇలా వండి తినండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Snake Gourd Curry : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో పొట్లకాయలు ఒకటి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ వీటిల్లో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు అద్భుతమనే చెప్పాలి. పొట్లకాయల్లో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. జీర్ణక్రియ సరిగ్గా ఉంటుంది. కిడ్నీలు, శరీరం మొత్తం శుభ్రంగా మారుతాయి. ఇంకా పొట్లకాయలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటిని కూరగా కూడా చేసుకోవచ్చు. వీటిని తినేందుకు ఇష్టపడని వారు కూడా ఈ విధంగా కూర చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఇక పొట్లకాయ కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

make Snake Gourd Curry in this way you will like this
Snake Gourd Curry

పొట్లకాయ పాలు కూర తయారీకి కావల్సిన పదార్థాలు..

పొట్లకాయ – 1, కొబ్బరినూనె – ఒకటీస్పూన్‌, ఉల్లిపాయ తరుగు – పావు కప్పు, కారం – ఒక టీస్పూన్‌, కొత్తిమీర – చిన్నకట్ట, కరివేపాకు – రెండు రెబ్బలు, పాలు – అర కప్పు (మరిగించాలి), ఉప్పు – తగినంత, తాజా కొబ్బరి తురుము – పావు కప్పు, జీలకర్ర – అర టీస్పూన్‌, తరిగిన పచ్చిమిర్చి – 2, ఆవాలు – పావు టీస్పూన్‌, ఎండు మిర్చి – 4, పసుపు – పావు టీస్పూన్‌.

పొట్లకాయ పాలు కూరను తయారు చేసే విధానం..

స్టవ్‌ మీద బాణలి పెట్టి వేడి అయ్యాక కొబ్బరి నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి వేయించాలి. ఉల్లితరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి ఉల్లి తరుగు బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి. పొట్లకాయ ముక్కలు వేసి మాత పెట్టాలి. ముక్కలు బాగా ఉడికిన తరువాత ఉప్పు, మిరపకారం వేసి కలపాలి. కొబ్బరి తురుము, పాలు వేసి మరోసారి కలిపి మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. కూర బాగా దగ్గర పడిన తరువాత కొత్తిమీర వేసి దింపేయాలి. దీన్ని అన్నం లేదా చపాతీలు, పుల్కాలు, రోటీ.. దేంతో కలిపి తిన్నా సరే చాలా బాగుంటుంది. అలాగే మనకు పోషకాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

Editor

Recent Posts