White Honey : ఇది కూడా తేనె అని మీకు తెలుసా.. దీంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

White Honey : చాలామంది గోధుమ వర్ణంలో ఉండే తేనెను చూసి ఉంటారు. కానీ తెలుపు రంగులో కూడా తేనె ఉంటుందని చాలామందికి తెలియదు. అయితే తెలుపు రంగులో ఉండే తేనె చూస్తే చాలా మంది అది సహజ సిద్ధమైనది కాదని భావిస్తారు. నిజానికి తెలుపు రంగులో కూడా తేనె ఉంటుంది. ఈ విధంగా తెలుపు రంగులో ఉన్నటువంటి తేనెను వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విధమైనటువంటి తెల్ల తేనెను ముడి తేనె అని కూడా అంటారు. మరి ఈ తెల్లటి తేనె వల్ల కలిగే లాభాలు ఏమిటి..? తెల్ల తేనె తీసుకోవడం వల్ల ఎలాంటి జబ్బులకు దూరంగా ఉండవచ్చు.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

తెలుపు రంగులో ఉన్నటువంటి తేనెలో మెగ్నీషియం, భాస్వరం, జింక్ లతో విటమిన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఈ తెల్ల తేనెను హౌస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల దీనిని ఈ విధంగా హౌస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని పిలుస్తారు. ఈ విధమైనటువంటి తెల్ల తేనెను ఉపయోగించి దగ్గు, గుండె జ‌బ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.

White Honey benefits in telugu must know about them
White Honey

ప్రస్తుతం వాతావరణంలో మార్పులు కారణంగా చాలా మంది దగ్గు సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో టేబుల్ స్పూన్ తేనె, నిమ్మరసం కలిపి తాగితే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. అదే విధంగా ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒక టేబుల్ స్పూన్ తేనెను తాగటం వల్ల నోటిలో ఏర్పడే నోటి పుండ్లు, నోటి ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తొలగిపోతాయి. ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు. ఈ క్రమంలోనే రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇలా తెల్ల తేనెతో ఎన్నో ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Editor

Recent Posts