Masala Egg Fry : కోడిగుడ్ల‌తో మ‌సాలా ఎగ్ ఫ్రైని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి రుచి చూడండి.. విడిచిపెట్ట‌రు..

Masala Egg Fry : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌న్నీ క‌లిగి ఉండే ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. వైద్యులు కూడా మ‌న‌కు కోడిగుడ్డును ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. కోడిగుడ్ల‌ను ఉడికించి నేరుగా తీసుకోవ‌డంతో పాటు వాటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఉడికించిన కోడిగుడ్డుతో చేసే వంట‌కాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా ఉడికించిన కోడిగుడ్ల‌తో ఎంతో రుచిగా ఎంతో సుల‌భంగా చేసుకోగ‌లిగే మ‌సాలా ఎగ్ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌సాలా ఎగ్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కోడిగుడ్లు – 4, నూనె – అర క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 3 ( పెద్ద‌వి), చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పుదీనా త‌రుగు – 2 టీ స్పూన్స్, కొత్తిమీర త‌రుగు – 2 టీ స్పూన్స్.

Masala Egg Fry recipe in telugu tastes better make like this
Masala Egg Fry

మ‌సాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, యాల‌కులు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, అనాస పువ్వు – 1, ల‌వంగాలు – 6, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – పావు క‌ప్పు, గ‌స‌గ‌సాలు – 2 టీ స్పూన్స్.

మ‌సాలా ఎగ్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో మసాలా పొడికి కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి చ‌క్క‌టి వాస‌న వ‌చ్చే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కోడిగుడ్ల‌ను వేసి గోల్డ్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి ముక్క‌లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ఉల్లిపాయ‌ల‌ను మ‌గ్గించాలి. ఉల్లిపాయ ముక్క‌లు మ‌గ్గిన త‌రువాత ప‌సుపు, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న మ‌సాలా పొడిని వేసి క‌ల‌పాలి. ఇప్పుడు వేయించిన కొడిగుడ్ల‌ను నాలుగు ముక్క‌లుగా చేసుకుని కోడిగుడ్డు చెద‌ర‌కుండా క‌లుపుకోవాలి. త‌రువాత పుదీనా, కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌సాలా ఎగ్ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రై తో అంద‌రూ రోజూ తినే దాని కంటే ఎక్కువే తింటారు. కోడిగుడ్ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా మ‌సాలా ఎగ్ ఫ్రైను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts