Bottle Gourd Juice For Liver : మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. దాదాపు 500 పైగా విధులను కాలేయం మన శరీరంలో నిర్వర్తిస్తుంది. శరీరంలో విధులకు అవసరమయ్యే రసాయనాలను ఉత్పత్తి చేసే ఒక ప్రయోగశాలగా కాలేయం పని చేస్తుంది. రక్తంలో మలినాలను తొలగించడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. మందులను వాడడం వల్ల అలాగే మద్యపానం చేయడం వల్ల శరీరంలో చేరిన విషాన్ని కూడా కాలేయం బయటకు పంపిస్తుంది. జ్వరం, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా చాలా మంది మందులు వాడుతుంటారు. అలాగే మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, ఒత్తిడి వంటి ఇతర కారణాల వల్ల కూడా కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాలేయ ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బతిన్నా కూడా శరీర జీవక్రియ మొత్తం అంతలాకుతలం అవుతుంది.
కాలేయం విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ ఆరోగ్యంగా ఉండాలంటే కాలేయాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. మన వంటింట్లో కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించి డిటాక్స్ పానీయాలను తయారు చేసుకుని తాగడం వల్ల కాలేయంలోని మలినాలన్నీ తొలగిపోతాయి. దీంతో కాలేయాన్ని మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కాలేయాన్ని శుభ్రపరిచే ఈ డిటాక్స్ పానీయాల గురించి అలాగే వీటిని ఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయంలోని మలినాలను తొలగించడంలో సొరకాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సొరకాయలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎన్నో ఉన్నాయి. సొరకాయను తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్ లు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. దీనిని తీసుకోవడం వల్ల కాలేయం వాపు తగ్గుతుంది.
ముందుగా ఒక సొరకాయ ముక్కను తీసుకుని దానిని ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కలను జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీరను అలాగే తగినన్ని నీళ్లను పోసి మెత్తగా జ్యూస్ లాగా చేసుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ జ్యూస్ లో పావు టీ స్పూన్ మోతాదులో వేసి కలపాలి. తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని అలాగే రుచికి తగినంత బ్లాక్ సాల్ట్ ను కలపాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను ఉదయం అల్పాహారం చేసిన తరువాత తాగాలి. అలాగే ఈ పానీయాన్ని తీసుకున్న గంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఇలా మూడు రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే చాలు కాలేయంలోని మలినాలు, విష పదార్థాలన్నీ తొలగిపోతాయి. కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే 10 నుండి 15 ఎండు ద్రాక్షలను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి.
ఇలా తయారు చేసుకున్న నీటిని రోజు మొత్తంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ నీటిని తాగుతూ ఈ ఎండు ద్రాక్షను తినడం వల్ల కేవలం 24 గంటల్లోనే కాలేయం మొత్తం శుభ్రపడుతుంది. అదే విధంగా రోజూ గ్రీన్ టీ ని తాగడం వల్ల కూడా కాలేయం శుభ్రపడుతుంది. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ టీ ని తాగడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు కరగుతుంది. కనుక ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ ని తాగడం వల్ల కాలేయంలోని మలినాలు తొలగిపోయి కాలేయం శుభ్రపడుతుంది. ఈ చిట్కాలను పాటిస్తూనే నీటిని ఎక్కువగా తాగాలి. తాజా ఆకుకూరలను, కూరగాయలను, పండ్లను తీసుకోవాలి. అలాగే వారానికి ఒకటి లేదా రెండు సార్లు పాలకూరను ఆహారంగా తీసుకోవాలి.
అలాగే బీట్ రూట్ ను కూడా వారానికి ఒకసారి తీసుకోవాలి. బీట్ రూట్ ను తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. వీటిలో ఉండే బీటా కెరోటీన్ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. విటమిన్ సి కాలేయాన్ని డీటాక్స్ చేయడంలో శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో విటమిన్ సి ఎంతో దోహదపడుతుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం కాలేయాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ చిట్కాలను పాటించడం వల్ల కాలేయ ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.