Mixed Vegetable Fry : వెజిటబుల్స్ అన్నీ కలిపి పచ్చిమిర్చి కారంతో ఇలా వేపుడు చేయండి.. ఎంతో సూప‌ర్‌గా ఉంటుంది..!

Mixed Vegetable Fry : మ‌నం అంద‌రికి మిక్డ్స్ వెజిటేబుల్ క‌ర్రీ గురించి తెలుసు. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని త‌రుచూ చేస్తూ ఉంటారు. మిక్స్డ్ వెజిటేబుల్స్ తో కర్రీని త‌యారు చేసుకున్న‌ట్టు మ‌నం ఫ్రైను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మిక్స్డ్ వెజిటేబుల్స్ తో చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ ఫ్రైను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ మిక్డ్స్ వెజిటేబుల్ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మిక్డ్స్ వెజిటేబుల్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిక్కుడు కాయ ముక్క‌లు -ఒక క‌ప్పు, క్యారెట్స్ – 2, బీన్స్ ముక్క‌లు – ఒక క‌ప్పు, త‌రిగిన పెద్ద బంగాళాదుంప – 1, నీళ్లు – ఒక గ్లాస్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, వెల్లుల్లి పాయ – 1, ప‌చ్చిమిర్చి – 10 లేదా త‌గినన్ని, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, మెంతులు – చిటికెడు, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 4, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Mixed Vegetable Fry recipe in telugu very tasty easy to make
Mixed Vegetable Fry

మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో కూర‌గాయ ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు, నీళ్లు పోసి 80 శాతం వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. ముక్క‌ల‌ల్లో నీళ్లు ఉంటే నీటిని వ‌డ‌క‌ట్టి ముక్క‌ల‌ను ప‌క్కకు ఉంచాలి. త‌రువాత జార్ లో ప‌చ్చిమిర్చి, వెల్లుల్లిపాయ‌లు, జీల‌క‌ర్ర వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని పక్క‌కు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మెంతులు, తాళింపు దినుసులు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉడికించిన ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చిమిర్చి పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని చిన్న మంట‌పై క‌లుపుతూ 10 నుండి 15 నిమిషాల పాటు వేయించాలి. ముక్క‌లు మెత్త‌గా అయిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై త‌యార‌వుతుంది. అన్నం, చ‌పాతీ, రోటీ అలాగే సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది.

D

Recent Posts