Mixed Vegetable Omelette : కోడిగుడ్ల‌తో ఇలా ఎప్పుడైనా ఆమ్లెట్ వేశారా.. రుచి ఎంతో బాగుంటుంది..!

Mixed Vegetable Omelette : కోడిగుడ్ల‌తో మ‌నం కూర‌లే కాకుండా చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో ఆమ్లెట్ కూడా ఒక‌టి. ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ఆమ్లెట్ ను మ‌నం మ‌రింత రుచిగా మ‌రింత ఆరోగ్యంగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కూర‌గాయ ముక్క‌లు వేసి చేసే ఈ వెజ్ ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని 5 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌రింత రుచిగా, మ‌రింత ఆరోగ్యంగా మిక్డ్స్ వెజ్ అమ్లెట్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మిక్డ్స్ వెజ్ ఆమ్లెట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న‌గా త‌రిగిన క్యాప్సికం – 1 ( చిన్న‌ది), క్యారెట్ తురుము – ఒక టేబుల్ స్పూన్, కోడిగుడ్లు – 3, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ట‌మాట – 1, మిరియాల పొడి – పావు టీ స్పూన్, నూనె – కొద్దిగా, ఉప్పు- త‌గినంత‌, కారం – పావు టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్.

Mixed Vegetable Omelette recipe in telugu make in this method
Mixed Vegetable Omelette

మిక్డ్స్ వెజ్ ఆమ్లెట్ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో క్యాప్సికం, క్యారెట్, ఉల్లిపాయ‌, ట‌మాట ముక్క‌లు తీసుకోవాలి. త‌రువాత మిరియాల పొడి, ఉప్పు, కారం, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత కోడిగుడ్ల‌ను వేసి బాగా క‌ల‌పాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కోడిగుడ్డు మిశ్ర‌మాన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. త‌రువాత దీనిపై మూత‌ను పెట్టి చిన్న మంట‌పై ఉడికించాలి. ఆమ్లెట్ ఒక వైపు చ‌క్క‌గా ఫ్రై అయిన త‌రువాత దీనిని నెమ్మ‌దిగా మ‌రో వైపుకు తిప్పుకోవాలి. ఇలా ఆమ్లెట్ ను రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మిక్డ్స్ వెజ్ ఆమ్లెట్ త‌యార‌వుతుంది. దీనిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్నికూడా పొంద‌వ‌చ్చు. బ్రేక్ ఫాస్ట్ గా, స్నాక్స్ గా లేదా సైడ్ డిష్ గా కూడా దీనిని తిన‌వ‌చ్చు.

D

Recent Posts