Unstoppable : బాల‌కృష్ణ షోకి ఎన్టీఆర్ ఎందుకు డుమ్మా కొట్టాడు.. అస‌లు కార‌ణం ఏంటి?

Unstoppable : తొలిసారి బాల‌కృష్ణ హోస్ట్‌గా రూపొందిన టాక్ షో అన్‌స్టాప‌బుల్. ఈ షో ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. నందమూరి బాలకృష్ణ ఒకవైపు వరుసగా మూవీల్లో నటిస్తూనే మరోవైపు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నిర్వహిస్తోన్న అన్‌స్టాపబుల్‌ షోతో అలరిస్తూ వ‌చ్చారు. అన్‌స్టాపబుల్‌ షో నాన్ స్టాపబుల్‌గా దూసుకెళ్లింది. మోహన్‌బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, మ‌హేష్ బాబు ఇలా ప‌లువురు గెస్ట్‌లుగా వచ్చారు. హోస్ట్‌గా బాలయ్య అడిగే ప్రశ్నలకు.. గెస్ట్‌లు ఇచ్చే ఆనర్స్‌తో షో అన్‌స్టాపబుల్‌గా రన్ అయింది. త్వ‌ర‌లోనే రెండో సీజ‌న్ ప్రారంభం కానుంది.

this is the reason for ntr not attending the unstoppable event
this is the reason for ntr not attending the unstoppable eventthis is the reason for ntr not attending the unstoppable event

అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో దర్శకదిగ్గజం రాజమౌళితో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్ కీరవాణి సందడి చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా వీరిద్ద‌రు మాత్ర‌మే ఈ షోకి హాజ‌రు కావ‌డంతో అంద‌రిలో అనేక అనుమానాలు తలెత్తాయి. ఎన్టీఆర్ కూడా వ‌చ్చి ఉంటే బాగుండేది, ఆయ‌న రాక‌పోవ‌డానికి కార‌ణ‌మేంట‌ని ప‌లువురు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. అయితే రీసెంట్ గా ఈ షోకి ఎన్టీఆర్ ఎందుకు హాజరు కాలేదో ఆ షోకి దర్శకత్వం వహించిన బీవీఎస్ రవి వెల్లడించాడు.

రాజమౌళి, కీరవాణిలతో ఓ ఎపిసోడ్‌ చేశాం. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హాజరు కావాల్సి ఉంది కానీ వారు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్‌లో చాలా బిజీగా ఉన్నారు” అని రవి వివరించారు. టైట్ షెడ్యూల్స్ వ‌ల‌న వారు పాల్గొనే ఛాన్స్ ద‌క్క‌లేదు. మేము ప్రభాస్ మరియు కృష్ణంరాజు గారితో ఒక ఎపిసోడ్ కూడా ప్లాన్ చేసాము, అయితే ప్రభాస్ రాధే శ్యామ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. అదొక్కటే కారణం. మరి రెండో సీజన్‌లో అయినా ఎన్టీఆర్, బాలకృష్ణల కాంబినేషన్‌ని అభిమానులు చూస్తారో లేదో చూడాలి.

Editor

Recent Posts