Mutton Keema Pulao : మ‌ట‌న్ కీమాతో ఇలా పులావ్‌ను ఎంతో ఈజీగా కుక్క‌ర్‌లో చేయ‌వచ్చు..!

Mutton Keema Pulao : మ‌నం వివిధ ర‌కాల పులావ్ ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వెజ్, నాన్ వెజ్ ల‌లో చాలా ర‌కాల పులావ్ వెరైటీలు ఉన్నాయి. మ‌నం త‌యారు చేసే వివిధ ర‌కాల పులావ్ ల‌లో కీమా పులావ్ కూడా ఒక‌టి. మ‌ట‌న్ కీమాతో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో కూడా ఈ పులావ్ ల‌భ్య‌మ‌వుతుంది. అయితే చాలా మంది దీనిని త‌యారు చేయ‌డం చాలా శ్ర‌మ‌తో చాలా స‌మ‌యంతో కూడిన పని అని భావిస్తూ ఉంటారు. కానీ చాలా సుల‌భంగా చాలా రుచిగా కుక్క‌ర్ లో కూడా మ‌నం ఈ పులావ్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్, మొద‌టి సారి చేసే వారు ఇలా ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. కీమా పులావ్ ను కుక్క‌ర్ లో రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కీమా పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, న‌ల్ల యాల‌క్కాయ – 1, బిర్యానీ ఆకు – 1, ల‌వంగాలు – 5, యాల‌కులు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, సాజీరా – ఒక టీ స్పూన్, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం -ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా -ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి -ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, మ‌ట‌న్ కీమా – పావు కిలో, నీళ్లు – అర క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, గంట పాటు నాన‌బెట్టిన బాప్మ‌తీ బియ్యం – ఒక క‌ప్పు.

Mutton Keema Pulao recipe in telugu make in this method
Mutton Keema Pulao

కీమా పులావ్ త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు, కారం, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత శుభ్రం చేసిన కీమా వేసి క‌ల‌పాలి.దీనిని 3 నుండి 4 నిమిషాల పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత కుక్క‌ర్ మూత పెట్టి 4 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత మూత తీసి కీమాలోని నీరంతా పోయే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర‌, పుదీనా వేసి క‌ల‌పాలి.

త‌రువాత బాస్మ‌తీ బియ్యం వేసి క‌ల‌పాలి. ఇప్పుడు 300 ఎమ్ ఎల్ నీళ్లు పోసి క‌లిపి మ‌ర‌లా కుక్క‌ర్ మూత పెట్టి పెద్ద మంట‌పై 2 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స‌ట్వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని 20 నిమిషాల పాటు క‌దిలించ‌కుండా అలాగే ఉంచాలి. త‌రువాత మూత తీసి అంతా క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కీమా పులావ్ త‌యార‌వుతుంది.దీనిని మిర్చి కా సాల‌న్ వంటి కూర‌ల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా కీమా పులావ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts