Urine Infection : కేవలం 5 నిమిషాల్లో మూత్రంలో మంట, యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యల‌ను తగ్గించే అద్భుతమైన చిట్కా

Urine Infection : మ‌న‌లో చాలా మంది త‌ర‌చూ యూరిన్ ఇన్పెక్ష‌న్ బారిన ప‌డుతూ ఉంటారు. దీని వ‌ల్ల మూత్రాశ‌యం, గ‌ర్భాశ‌యం, మూత్రం ప్ర‌వహించే మార్గం అన్ని ప్ర‌భావానికి గురి అవుతాయి. ముఖ్యంగా ఈ స‌మ‌స్య స్త్రీల‌ల్లో వ‌స్తుంది. యూరిన్ ఇన్ఫెక్ష‌న్ బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఎక్కువ స‌మ‌యం మూత్రాన్ని ఆపుకోవ‌డం వ‌ల్ల అలాగే గ‌ర్భిణీ స్త్రీల‌ల్లో, డ‌యాబెటిస్ తో బాధ‌పడే వారిలో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా వ‌స్తుంది. మ‌సాలా క‌లిగిన ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, మ‌ద్య‌పాన సేవ‌నం, నీటిని త‌క్కువ‌గా తాగ‌డం వంటి కార‌ణాల చేత కూడా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. యూరిన్ ఇన్ఫెక్ష‌న్ ల వ‌ల్ల మూత్ర విస‌ర్జ‌న స‌మ‌యంలో మంట‌, త‌ర‌చూ మూత్రం వ‌చ్చిన‌ట్టు ఉండ‌డం, వెన్ను భాగంలో ఒక్క‌సారిగా నొప్పి రావ‌డం వంటి ల‌క్ష‌ణాల‌ను మ‌న‌లో క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే త‌గిన చికిత్స తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం.

యాంటీ బ‌యాటిక్ ల‌ను వాడ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుండి మ‌నం చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అయితే యాంటీ బ‌యాటిక్ ల‌కు బ‌దులుగా ఆయుర్వేద చిట్కాల‌ను ఉప‌యోగించి మ‌నం మ‌రింత సుల‌భంగా, మ‌రింత త్వ‌ర‌గా ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అలాగే ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఆపిల్ సైడ్ వెనిగ‌ర్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీ స్పూన్ ఆపిల్ సైడ్ వెనిగ‌ర్ ను వేసుకోవాలి. త‌రువాత ఇందులో అర చెక్క నిమ్మ‌ర‌సాన్ని, ఒక టీ స్పూన్ తేనెను వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న నీటిని ఉద‌యం అల్పాహారం తీసుకున్న అర గంట త‌రువాత అలాగే సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా యూరిన్ ఇన్ఫెక్ష‌న్ త‌గ్గుతుంది. అలాగే యూరిన్ ఇన్ఫెక్ష‌న్ తో బాధ‌ప‌డే వారు విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. గంట‌కు ఒక‌సారి పుల్ల‌గా ఉండే పండ్ల‌ను తీసుకోవాలి.

Urine Infection wonderful home remedy
Urine Infection

ఇలా విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే ఉద‌యం ప‌ర‌గ‌డుపున గోరు వెచ్చ‌ని నీటిలో నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా యూరిన్ ఇన్పెక్ష‌న్ త‌గ్గు ముఖం ప‌డుతుంది. అలాగే ప్ర‌తిరోజూ నీటిని ఎక్కువ‌గా తాగాలి. మూత్ర‌విస‌ర్జ‌న చేసిన త‌రువాత ఆ భాగాన్ని శుభ్రంగా క‌డుక్కోవాలి. ధ‌నియాల క‌షాయాన్ని తాగాలి. మూత్రంలో ఇన్ఫెక్ష‌న్ త‌గ్గించ‌డంలో ధ‌నియాల క‌షాయం చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. యూరిన్ ఇన్ఫెక్ష‌న్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఆ స‌మ‌స్య త‌గ్గే వ‌ర‌కు లైంగిక చ‌ర్య‌ల‌ల్లో పాల్గొన‌కూడ‌దు. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా యూరిన్ ఇన్ఫెక్ష‌న్ ను త‌గ్గించుకోవ‌చ్చు.

D

Recent Posts