తమిళనాడు మైసూర్ దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ కి ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో వెంటనే రైల్వే శాఖ అప్రమత్తమైంది. అయితే, ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. విచారణని రైల్వే శాఖ NIA కి అప్పగించడం జరిగింది. కవరైపేట్టై రైల్వే స్టేషన్ లో మైసూర్ దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలు శుక్రవారం రాత్రి ఢీకొన్నాయి. తర్వాత మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. 13 కోచ్లు పట్టాలు తప్పాయి. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని తెలుస్తోంది.
బాలాసోర్లో జరిగినట్టుగానే రైలు ముందుకు సాగడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. అప్పటికే అక్కడ గూడ్స్ రైలు నిలబడి ఉంది. ఆ క్రమంలో ప్యాసింజర్ రైలు వెళ్లి గూడ్స్ ని ఢీ కొట్టింది. డ్రైవర్ అప్రమత్తమయ్యారు. షాక్ తగిలేసరికి బ్రేకులు వేశారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. కొంతమందిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఇప్పటికైతే ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదని తెలుస్తోంది.
ఈ ప్రమాదంపై అప్రమత్తమైన రైల్వే శాఖ విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేస్తోంది. రైల్వే ఉద్యోగి తప్పిదం వలన ప్రమాదం జరిగిందా లేదంటే ఎవరైనా కావాలని చేశారా అనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు. పండుగల సీజన్ కావడంతో రైలులో ప్రయాణికులు ఎక్కువగా వున్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గాయపడిన వాళ్ళను వెంటనే చెన్నైలోనే ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.