Harsha Bhogle : టీవీ చానల్స్ వారు మాత్రమే కాదు.. యూట్యూబ్ చానల్స్ వారు కూడా తమ షోలకు రేటింగ్స్, వ్యూస్ తెప్పించుకోవడం కోసం కొన్నిసార్లు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. అయితే అవి ఒక్కోసారి బాగానే జరుగుతుంటాయి. కానీ ఫెయిలైతే మాత్రం నెటిజన్ల ఆగ్రహానికి గురి కావల్సి వస్తుంది. తాజాగా ప్రముఖ క్రికెట్ కామెంటేటెర్ హర్ష భోగ్లేకు కూడా ఇలాగే జరిగింది. దీంతో నెటిజన్లు ఆయనపై ఫైర్ అవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ ఛానెల్ వారు హర్ష భోగ్లేతో ఐపీఎల్ 2022 పై ఓ లైవ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. అందులో హర్ష భోగ్లే సదరు చానల్ యాంకర్‌తో లైవ్‌లో మాట్లాడుతున్నారు. అయితే సడెన్‌గా హర్ష భోగ్లే లైవ్‌లో కనిపించకుండా పోయారు. పైగా ఎవరో దాడి చేసినట్లు ఆయన అరిచారు. దీంతో లైవ్‌లో ఉన్న యాంకర్ కు కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మొదట్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల అలా అయిందని యాంకర్ భావించాడు. కానీ హర్ష భోగ్లే మళ్లీ లైవ్‌లోకి రాలేదు. దీంతో ఆ యాంకర్‌లోనూ కంగారు మొదలైంది. ఈ క్రమంలోనే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే అలా జరిగాక హర్ష భోగ్లే మళ్లీ కనిపించలేదు. దీంతో క్రికెట్ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు. హర్ష భోగ్లేకు ఏమైంది ? అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు. అయితే ఎట్టకేలకు ఆయనే స్వయంగా ఆ సంఘటనపై వివరణ ఇచ్చారు. తనకేమీ కాలేదని.. తాను బాగానే ఉన్నానని.. తనపై ఎవరూ దాడి చేయలేదని.. తాము ఒకటి ప్రయత్నిస్తే అది ఇంకొకటి అయిందని.. కనుక ఇందుకు క్షమించాలని.. హర్ష భోగ్లే కోరారు. అయితే ఇదంతా ఆ కార్యక్రమానికి హైప్ తెచ్చేందుకు చేసిన ట్రిక్ అని తెలిసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇంకోసారి ప్లే చేయకండి.. అంటూ హెచ్చరిస్తున్నారు.