ఆధ్యాత్మికం

House Building Pooja : కొత్త ఇంటిని క‌డుతున్నారా..? ఇంటికి శంకుస్థాప‌న కోడ‌లు చెయ్యాలా..? కూతురా..?

House Building Pooja : చాలామందికి, సొంత ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉంటుంది. సొంత ఇల్లు కట్టుకోవడానికి, డబ్బులుని కూడా దాస్తూ ఉంటారు. కొంతమంది, సొంత ఇంటిని నిర్మించుకోవాలని ఎప్పటినుండో చూసి చూసి, బ్యాంకు లోన్ తీసుకోవడం లేదంటే ఎలాగో అలా డబ్బులు తెచ్చి ఇల్లు కట్టడం వంటివి చేస్తూ ఉంటారు. నిజానికి, ఇల్లు కట్టాలన్న కోరిక ఉన్న వాళ్ళు ఇల్లుని పూర్తి చేస్తే ఆ సంతృప్తి వేరు. అయితే, ఇల్లు కట్టడానికి ముందు శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపనకి కూడా ముహూర్తం పెట్టాలి. అలానే, ఎవరు శంకుస్థాపన చేయాలి అన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

ఇంటి శంకుస్థాపన కోసం ముందు, ఒక మంచి ముహూర్తాన్ని పెట్టించండి. ఇంటి యజమాని, యజమానురాలు ఇద్దరి పేర్లు మీద పంచాంగం చూసి, ముహూర్త కాలాన్ని నిర్ణయిస్తారు. ఆ వ్యక్తులు, వారి పేర్లు మీద ముహూర్త బలం లేనప్పుడు, మిగతా కుటుంబ సభ్యుల పేరు మీద ముహూర్తం చూసి, తేదీ, సమయాన్ని నిర్ణయిస్తారు. ఇంటి శంకుస్థాపన కోడలితో చేయించాలా..? కూతురుతో చేయించాలా..? ఈ విషయానికి వస్తే కూతురుతో కంటే కోడలతోనే శంకుస్థాపన కార్యక్రమం చేయిస్తే మంచిది.

new home pooja daughter or daughter in law

ఇంటి కోడలు అంటే ఇంటి సభ్యురాలు. ఇంటికి యజమానురాలు. కొడుకు పేరు మీద కుదరకపోతే కోడలు పేరు మీద పూజ చేయించొచ్చు. కానీ, కూతురుతో మాత్రం చేయించకూడదు. ఎందుకంటే ఆమె మరొక ఇంటి మహాలక్ష్మి కనుక. కాబట్టి, ఇంటి శంకుస్థాపన చేయించేటప్పుడు, కూతురుతో కాదు కోడలితో చేయించాలి. పురోహితులు నిర్ణయించిన టైం కి పూజ కార్యక్రమాలను పూర్తి చేయాలి.

చెప్పిన టైంకి సమయం మించిపోకుండా చూసుకుని, జాగ్రత్తగా పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి. గృహప్రవేశం సమయానికి ఇంట్లోకి అడుగు పెట్టేయాలి. గృహప్రవేశానికి కూడా ముహూర్తం పెట్టించుకోవాలి. ఇల్లు కట్టుకునేటప్పుడు, సరైన దిశలో సింహద్వారం పెట్టించడం, వాస్తు ప్రకారం ఇల్లు ఉండడం ఇవన్నీ కూడా ముఖ్యము. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటే అంతా మంచి జరుగుతుంది.

Admin

Recent Posts