ఆధ్యాత్మికం

Pithru Devathalu : పితృ దేవతలు అంటే అసలు ఎవరు..? మరణించిన పెద్దలు కాదు..!

Pithru Devathalu : చాలాసార్లు మీరు పితృదేవతలు అనే పదాన్ని వినే ఉంటారు. పితృదేవతలు అంటే చనిపోయిన మన పెద్దలని, చాలామంది భావిస్తారు. కానీ నిజానికి అది నిజం కాదు. అసలు పితృదేవతలు అంటే ఎవరు అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మీకు కూడా ఈ సందేహం ఎప్పుడైనా కలిగిందా..? అయితే కచ్చితంగా ఇప్పుడే ఆ విషయం గురించి తెలుసుకోండి. మనందరి రాకపోకలని, పొందాల్సిన గతులని సమర్థవంతంగా నిర్వహించే దేవతావ్యవస్థ ని పితృదేవతలని అంటారు.

మనం చనిపోయిన పెద్దలకి పెట్టే పిండాలని వాళ్లకి చేరే విధంగా గతులని నిర్ణయిస్తారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్లీ ఇంకో జన్మని పొందడానికి 300 ఏళ్ళు పడుతుంది. కానీ కొన్నిసార్లు వెంటనే జన్మిస్తాడు జీవి. ఈ లెక్క అనేది జీవి యొక్క సంకల్ప బలముతో కూడింది. అలానే అతని ప్రారబ్ద కర్మ, ఆగామి.. అలానే సంచితం అనే కర్మల మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది.

who are Pithru Devathalu

మన కుటుంబంలో చనిపోయిన వాళ్ళు వెంటనే జన్మించినా, మనం చేసే పితృకర్మల ఫలితం వారికి దక్కుతుంది. ఏ రూపంలో పెట్టినా కూడా మనం పెట్టినది వారికి అందుతుంది. ఇవి చేయడానికి పితృదేవతలు ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఉదాహరణకి మన పూర్వీకులు ఆవు రూపంలో పుడితే, గడ్డి మొదలైన రూపాల్లో మనం పెట్టే ఆహారం మారి వాళ్లకి వెళ్తుంది. పితృదేవతలు సంతోషిస్తారు. మనకి మంచి జరిగేలా చూస్తారు.

ఒకవేళ మరణించిన వాళ్లు ముక్తిని పొంది, ఉత్తమ గతుల్ని పొందితే మనం చేసినవి అవసరం లేకుంటే, ఆయా పితృ కర్మల ఫలితం మన కోరికలు తిరిగే విధంగా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ల పుణ్యం వలన దేవలోకంలో దేవతలుగా ఉంటే, పెట్టిన పిండాలు అమృత రూపంగా వెళ్తాయి. మనిషి కింద పుడితే అన్న రూపంలో వెళ్తాయి. పశుపక్షుల రూపంలో అయితే గడ్డి మొదలైన ఆహార పదార్థాల రూపంలో వెళ్తాయి. అందుకే కచ్చితంగా పిండ ప్రధానం చేయమని అంటారు పెద్దలు.

Admin

Recent Posts