వినోదం

Nuvvu Naku Nachav : నువ్వు నాకు న‌చ్చావు సినిమాలోని ఆ రెండు సీన్ల‌లో తేడాలు గ‌మ‌నించారా..?

Nuvvu Naku Nachav : విక్ట‌రీ వెంక‌టేష్ క్లాసిక‌ల్ హిట్ నువ్వు నాకు నచ్చావ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది. విజయభాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్లస్ అయ్యాయి. అంతేకాదు ఈ చిత్రానికి కథ కూడా ఆయనే అందించాడు. స్రవంతి రవికిశోర్ నిర్మించిన నువ్వు నాకు నచ్చావ్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. 200 రోజులు ఆడి చరిత్ర తిరగరాసింది. 2001, సెప్టెంబర్ 6న విడుదలైంది. క్లాసిక్ ల‌వ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

అయితేఈ సినిమాలో కొన్ని త‌ప్పులు దొర్లాయి. వాటిని ఎవ‌రు గ‌మ‌నించ‌క‌పోవ‌డం విశేషం. వెంకీ.. ప్ర‌కాశ్ రాజ్ ఇంట్లో ఉంటుండ‌గా, ఒక రోజు వెంకీ వాళ్ల నాన్న రాసిన ఉత్త‌రాన్ని హీరోయిన్, ఆమె చెల్ల‌లు చ‌దివి వెంకీ దగ్గరికి వెళ్తారు. అప్పుడు హీరోయిన్ చెల్లెలు తన పేరు పింకీ అని, తను లిటిల్ ఫ్లవర్స్ కాన్వెంట్ లో తొమ్మిదో తరగతి చదువుతోంది చెప్తుంది. తర్వాత ఒక సీన్ లో పింకీ స్కూల్ కి వెళ్లడానికి బస్ స్టాప్ లో నిల్చున్నప్పుడు కొంత మంది తనని ఏడిపిస్తారు. అప్పుడు హీరో రౌడీల‌ను కొట్టి పింకీని స్కూల్ బ‌స్ ఎక్కిస్తారు. ఆ స్కూల్ బస్ మీద ఉన్న పేరు గమనిస్తే B.V.B.P SCHOOL అని ఉంది.

nuvvu naku nachav have you observed this small mistake

లిటిల్ ఫ్లవర్స్ కాన్వెంట్ ని షార్ట్ కట్ లో రాశారేమో అనుకుంటే, అక్కడ ఉన్న లెటర్స్ కూడా పేరుకి మ్యాచ్ అయ్యేలా లేవు. అలా ప్ర‌తి సినిమాల్లో ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు కనిపిస్తాయి. నువ్వు నాకు న‌చ్చావు సినిమా అప్ప‌ట్లో పెద్ద హిట్ సాధించ‌డ‌మే కాక సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఆ రోజుల్లో 18 కోట్ల షేర్ వ‌సూలు చేసింది అంటే చిన్న విషయం కాదు. చాలా తక్కువ సినిమాలు మాత్రమే అంత వసూలు చేసాయి. అందులో ‘నువ్వు నాకు నచ్చావ్’ కూడా ఒకటి. రూ.7.24 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. ఫుల్ రన్‌లో ఏకంగా రూ.18.04 కోట్లు వసూలు చేసింది.

Admin

Recent Posts