వినోదం

Greeshma Nethrika : మ‌ల్లీశ్వ‌రి చిత్రంలో న‌టించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

Greeshma Nethrika : స్టార్ హీరోయిన్స్ క‌న్నా కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించి పెద్ద‌యిన భామ‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. ఒక‌ప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన వారు ఇప్పుడు హీరోయిన్స్ గా న‌టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రికొందరు మాత్రం సినిమా పరిశ్రమపై ఆసక్తి లేకపోవడంతో ఇతర రంగాల్లో సెటిల్ అవుతుంటారు.అయితే వెంక‌టేష్‌, క‌త్రినా కైఫ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన మ‌ల్లీశ్వ‌రి చిత్రంలో బాల‌న‌టిగా న‌టించిన గ్రీష్మ నేత్రిక ఇప్పుడు చాలా పెద్ద‌గా అయింది. ఈ అమ్మ‌డు మ‌ల్లీశ్వ‌రి చిత్రంలో “బార్ అంటే ఇంత పెద్ద గా ఉండాలని క్యూట్ గా చెబుతూ తన క్యూట్ క్యూట్ మాటలతో ప్రేక్షకులను బాగా అలరించింది.

అయితే గత కొద్ది కాలంగా ఈ అమ్మడు తన చదువుల నిమిత్తమై సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటోంది. కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన “మల్లీశ్వరి” చిత్రంలో హీరో వెంకటేష్ అన్నయ్య కూతురి పాత్రలో నటించింది గ్రీష్మ. తెలుగులో దాదాపుగా 30 కి పైగా చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.ఇందులో ముఖ్యంగా వందేమాతరం శ్రీనివాస్ ముఖ్య పాత్రలో నటించిన “అమ్ములు” చిత్రంలో కీలకపాత్ర పోషించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ప్రస్థానం, పంచాక్షరి, ఏమో గుర్రం ఎగరావచ్చు, తదితర చిత్రాలలో కూడా క‌నిపించి మెప్పించింది.

Greeshma Nethrika have you seen how is she now

ఇక ఎన్టీఆర్ బయోగ్రఫీ చిత్రంలో కూడా కనిపించి బాగానే అలరించింది.ఇటీవ‌ల తన చదువును పూర్తి చేసుకొని సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.మరి చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగానే రాణించిన గ్రీష్మ హీరోయిన్ గా ఎలా రాణిస్తుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ అమ్మ‌డు తెలుగులో “లవ్ యూ బంగారం” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కాగా, “శ్రావ్య”.. గ్రీష్మ సోదరి అని చాలా మందికి తెలియదు.అయితే శ్రావ్య తెలుగులో ఆర్య, అవునన్నా కాదన్నా, కాయ్ రాజా కాయ్, నందిని నర్సింగ్ హోమ్, తదితర చిత్రాలలో హీరోయిన్ గా న‌టించి మెప్పించింది.

Admin

Recent Posts