Onion Pickle : చుక్క నూనె కూడా లేకుండా ఉల్లిపాయ ప‌చ్చ‌డి ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Onion Pickle : మ‌న‌కు నార్త్ ఇండియా రెస్టారెంట్ ల‌లో, పంజాబి ధాబాలలో ల‌భించే వాటిలో ఉల్లిపాయ పచ్చ‌డి కూడా ఒక‌టి. అస్స‌లు నూనె వాడ‌కుండా చేసే ఈ ఉల్లిపాయ ప‌చ్చ‌డి సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ‌ల‌ను మ‌న‌కు చ‌పాతీ, రోటీ వంటి వాటిలోకి సైడ్ డిష్ గా స‌ర్వ్ చేస్తూ ఉంటారు. ఈ ఉల్లిపాయ ప‌చ్చ‌డిని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎక్కువ‌గా ఉల్లిపాయ‌ల‌ను, ప‌చ్చిమిర్చిని సైడ్ డిష్ గా తినే వారు ఇలా ప‌చ్చ‌డిగా చేసుకుని కూడా తీసుకోవ‌చ్చు. సైడ్ డిష్ గా తిన‌డానికి ఎంతో చ‌క్క‌గా ఉండే ఈ ఉల్లిపాయ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లిపాయ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న ఉల్లిపాయ‌లు – 20, నీళ్లు – ఒక‌టిన్న‌ర క‌ప్పులు, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4, మిరియాలు – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌టిక బెల్లం – చిన్న ముక్క‌, త‌రిగిన బీట్ రూట్ – 1, స‌న్న‌గా పొడ‌వుగా త‌రిగిన అల్లం ముక్క‌లు – 2 టీ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, వెనిగ‌ర్ – అర క‌ప్పు.

Onion Pickle recipe how to cook it without oil
Onion Pickle

ఉల్లిపాయ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా ఉల్లిపాయ‌ల‌పై ఉండే పొట్టును తీసేసి శుభ్రంగా క‌డగాలి. త‌రువాత వీటికి గుత్తి వంకాయ‌కు పెట్టిన‌ట్టు గాట్లు పెట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, మిరియాలు, ఉప్పు, ప‌టిక బెల్లం, బీట్ రూట్ వేసి 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నీరు కొద్దిగా చ‌ల్లారిన త‌రువా ఒక గాజు సీసాలో లేదా పింగాణీ గిన్నెలో ముందుగా సిద్దం చేసుకున్న ఉల్లిపాయ‌ల‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో అల్లం ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు, వెనిగ‌ర్ను వేసుకోవాలి.

త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న నీటిని బీట్ రూట్ ముక్క‌ల‌తో స‌హా వేసుకోవాలి. త‌రువాత మూత పెట్టి 2 రోజుల పాటు అలాగే ఉంచాలి. ముక్క‌లు బాగా ఊరిన త‌రువాత ఈ సీసాను ఫ్రిజ్ లో ఉంచి వారం రోజుల పాటు స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఉల్లిపాయ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. ఇలా త‌యారు చేసుకున్న ఉల్లిపాయ ముక్క‌ల‌ను, ప‌చ్చిమిర్చి ముక్క‌ల‌ను రోటీ, చ‌పాతీ, ప‌రాటా వంటి వాటితో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts