Palak Mutton : పాల‌కూర మ‌ట‌న్‌ను ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ చేసుకుంటారు..

Palak Mutton : ఆదివారం వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది నాన్ వెజ్ వంట‌కాల‌ను తినేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. అందులో భాగంగానే చికెన్‌, మ‌ట‌న్‌ల‌ను చాలా మంది తింటుంటారు. వాటితో కూర‌, బిర్యానీ, పులావ్‌, వేపుడు వంటివి చేస్తుంటారు. అయితే మ‌ట‌న్‌ను మ‌నం అనేక ర‌కాలుగా వండుకోవ‌చ్చు. వాటిల్లో పాల‌కూర మ‌ట‌న్ ఒక‌టి. పాల‌కూర‌లు వేసి మ‌ట‌న్‌ను వండితే ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు. దీన్ని త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే పాల‌కూర మ‌ట‌న్‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాల‌కూర మ‌ట‌న్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మ‌ట‌న్ – పావు కిలో, పాల‌కూర – నాలుగు క‌ట్ట‌లు, ఉల్లిపాయ‌లు – రెండు, క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టీస్పూన్లు, ప‌సుపు- పావు టీస్పూన్‌, కారం – 2 టీస్పూన్లు, ధ‌నియాల పొడి – 2 టీస్పూన్లు, గ‌రం మ‌సాలా పొడి – ఒక టీస్పూన్‌, ఉప్పు – త‌గినంత‌, నూనె – 3 టేబుల్ స్పూన్లు.

Palak Mutton recipe in telugu this is the way to cook
Palak Mutton

పాల‌కూర మ‌ట‌న్‌ను త‌యారు చేసే విధానం..

పాల‌కూర‌, ఉల్లిపాయ‌ల‌ను స‌న్న‌గా త‌రిగి ప‌క్క‌న పెట్టుకోవాలి. వెడ‌ల్పాటి పాన్ లేదా కుక్క‌ర్‌లో నూనె పోసి వేడి చేసి ఉల్లిపాయ ముక్క‌లు వేసి దోర‌గా వేయించాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత మ‌ట‌న్ ముక్క‌లు, త‌గినంత ఉప్పు వేసి బాగా క‌లిపి మూత పెట్టాలి. ముక్క‌లు బాగా వేగిన త‌రువాత కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. ముక్క‌లు బాగా ఉడికిన త‌రువాత పాల‌కూర వేసి క‌లిపి పూర్తిగా ద‌గ్గ‌ర ప‌డేవ‌ర‌కు ఉడికించాలి. నీరంతా పోయాక గ‌రం మ‌సాలా పొడి వేసి క‌లిపి దించేయాలి. పాల‌కూర‌ను మ‌రుగుతున్న నీళ్లలో వేసి రెండు నిమిషాల త‌రువాత తీసి మిక్సీలో పేస్ట్ చేసి కూడా క‌ల‌పొచ్చు. పాల‌కూర మ‌ట‌న్ మాదిరిగానే చికెన్‌ను కూడా వండుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని అంద‌రూ ఇష్టంగా తింటారు. అన్నం, చ‌పాతీ ఎందులోకి అయినా స‌రే పాల‌కూర మ‌ట‌న్ బాగుంటుంది. ఒక ముద్ద ఎక్కువే తింటారు.

Editor

Recent Posts