Cumin For Fat : స్థూలకాయం సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. ప్రస్తుత కాలంలో ఈ సమస్య బారిన పడే వారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి స్థూల కాయం కారణంగా అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. కారణాలేవైనప్పటికి ఈ సమస్య నుండి బయటపడడం చాలా అవసరం. లేదంటే బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు, స్థూలకాయం వంటి సమస్యలను మనం ఒక ఇంటి చిట్కాను ఉపయోగించి తగ్గించుకోవచ్చు. ఈచిట్కాను పాటించడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది. స్థూలకాయం సమస్య నుండి బయట పడేసే ఈచిట్కాను తయారు చేసుకోవడానికి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం జీలకర్రను ఉపయోగించాల్సి ఉంటుంది. జీలకర్రలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు అనేక ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. తీసుకున్న ఆహారాన్ని సక్రమంగా జీర్ణమయ్యేలా చేయడంతో పాటు జీర్ణశక్తిని మెరుగుపరిచే గుణం కూడా ఇందులో ఉంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే శక్తి కూడా జీలకర్రకు ఉంది. అలాగే ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం తేనెను, నిమ్మకాయను కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇవి రెండు కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేయడంలో ఇవి రెండు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఈ మూడు పదార్థాలతో చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే దీనిని ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఈ నీటిని చిన్న మంటపై 5 నుండి 10 నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ నీరు గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో ఒక టీ స్పూన్ తేనెను, ఒక అర చెక్క నిమ్మరసాన్ని వేసి కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడంతో పాటు వ్యర్థ పదార్థాలు కూడా తొలగిపోతాయి.
ఇలా తయారు చేసుకున్న నీటిని రోజూ ఉదయం పరగడుపున గోరు వెచ్చగా తీసుకోవడం వల్ల స్థూలకాయం సమస్య నుండి మనం చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ నీటిని తీసుకున్న గంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఇలా క్రమం తప్పకుండా ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల కొద్ది నెలల్లోనే మనం అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. అంతేకాకుండా ఈ జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల గ్యాస్, మలబద్దకం, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు.