Punarnava Plant : పునర్నవ.. ఈ మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు. దీనిని అటిక మామిడి అని కూడా పిలుస్తారు. ఈ పునర్నవ మొక్క ఎక్కడపడితే అక్కడ విరివిరిగా కనబడుతుంది. ఇది నేలపై పాకుతూ పెరుగుతుంది. వర్షాకాలంలో ఈ మొక్క మనకు ఎక్కువగా దొరుకుతుంది. ఈ పునర్నవ మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ మొక్కను ఔషధంగా విరివిరిగా ఉపయోగిస్తారు. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పునర్నవ ఆకులను కూరగా వండుకుని కూడా తింటారు. ఈ మొక్కలో ప్రతి భాగం కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
పునర్నవ ఆకులతో కషాయాన్ని చేసుకుని లేదా ఈ ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకుని తీసుకోవచ్చు. మూత్రపిండాల సమస్యలను తొలగించడంలో పునర్నవ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మూత్రపిండాల్లో ఉండే మలినాలను తొలగించి వాటి పనితీరును మెరుగపరచడంలో ఈ మొక్క మనకు ఎంతో దోహదపడుతుంది. ఒక గ్లాస్ నీటిలో ఒక గుప్పెడు పునర్నవ ఆకులను వేసి పది నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసిన పునర్నవ ఆకుల కషాయాన్ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి.
ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల మూత్రపిండాలకు సంబంధించిన అన్ని రకాల సమస్యల నుండి మనం విముక్తిని పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బీపీని నియంత్రించడంలో, శరీరంలో వాపులను, నొప్పులను తగ్గించడంలో కూడా ఈ పునర్నవ మొక్క మనకు సహాయపడుతుంది. పునర్నవ ఆకులతో చేసిన నూనెను వాడడం వల్ల మనం మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. పునర్నవ ఆకునుచ కూరగా వండుకుని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. పునర్నవ ఆకులను తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. కాలేయంలోని మలినాలు, విష పదార్థాలు తొలగిపోయి కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. అధిక బరువు, స్థూలకాయం సమస్యల నుండి కూడా బయటపడవచ్చు.
అంతేకాకుండా ఈ ఆకును తీసుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటాము. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండాఉంటాము. షుగర్ వ్యాధితో బాధపడే వారు పునర్నవ ఆకును వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. పునర్నన ఆకుకు షుగర్ వ్యాధిని నియంత్రించే శక్తి కూడా ఉంది. పునర్నవ మొక్కను ఉపయోగించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే ఈ ముక్కను ఉపయోగించే విధానంలో తీసుకునే పరిమాణంలో జాగ్రత్తలు వహించడం చాలా అవసరం.