Pallila Pachadi : ప‌ల్లీల ప‌చ్చ‌డిని ఎప్పుడైనా ఇలా చేశారా.. అన్నంలోకి చాలా బాగుంటుంది..

Pallila Pachadi : మ‌నం వంటింట్లో ప‌ల్లీల‌ను విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ప‌ల్లీల‌ను వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ప‌ల్లీల‌తో మ‌నం ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ల్లీల‌తో చేసే ప‌చ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ప‌ల్లీల‌తో ఎంతో రుచిగా అలాగే తేలిక‌గా చేసుకోగ‌లిగే ప‌ల్లి ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌ల్లి ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – ఒక క‌ప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, ప‌చ్చిమిర్చి – 10 లేదా కారానికి త‌గిన‌న్ని, త‌రిగిన ట‌మాటాలు – 3, ప‌సుపు – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర – అర టీస్పూన్, చింత‌పండు – కొద్దిగా, నీళ్లు – త‌గిన‌న్ని, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1.

Pallila Pachadi recipe in telugu make in this style
Pallila Pachadi

ప‌ల్లి ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా ప‌ల్లీల‌ను క‌ళాయిలో వేసి చిన్న మంట‌పై చ‌క్క‌గా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌చ్చిమిర్చి వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో ట‌మాట ముక్క‌లు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో వేయించిన ప‌ల్లీలు, ప‌చ్చిమిర్చి, జీల‌కర్ర‌, వెల్లుల్లి రెబ్బ‌లు, చింత‌పండు వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఉడికించిన ట‌మాట ముక్క‌లు వేసి మ‌ర‌లా మిక్సీ ప‌ట్టుకోవాలి.

త‌రువాత త‌గిన‌న్ని వేసి మ‌ర‌లా మిక్సీ ప‌ట్టుకోవాలి. ప‌చ్చ‌డి ప‌లుచ‌గా ఉండ‌కుండా గ‌ట్టిగా ఉండేలా చూసుకోవాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ముక్క‌లు కొద్దిగా క‌చ్చా ప‌చ్చాగా అయ్యే వ‌ర‌కు మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌ల్లి ప‌చ్చ‌డి త‌యారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌ల్లి ప‌చ్చ‌డిని అంద‌రూ ఇష్టంగా తింటారు. నోటికి ఏదైనా రుచిగా తినాల‌నిపించినప్పుడు ఇలా ప‌ల్లి ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts