Pizza Sauce : పిజ్జా సాస్‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Pizza Sauce : మ‌న‌లో చాలా మంది పిజ్జాను ఇష్టంగా తింటూ ఉంటారు. పిల్లలు, పెద్ద‌లు అంద‌రూ పిజ్జాను ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ పిజ్జాను కూడా మ‌నం ఇంట్లో త‌యారు చేస్తూ ఉంటాము. పిజ్జా చేయ‌డానికి ముఖ్చంగా కావ‌ల్సిన వాటిలో పిజ్జా సాస్ కూడా ఒక‌టి. పిజ్జా సాస్ వేసి చేయ‌డం వ‌ల్ల మాత్ర‌మే పిజ్జా రుచిగా ఉంటుంది. సాధార‌ణంగా ఈ పిజ్జా సాస్ మ‌న‌కు మార్కెట్ లో ల‌భిస్తుంది. దీనినే మ‌నం ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము. అయితే ఈ సాస్ ను బ‌య‌ట కొనే ప‌ని లేకుండా ఇంట్లోనే ఈ పిజ్జా సాస్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో త‌యారు చేసిన ఈ పిజ్జా సాస్ తో పిజ్జా మ‌రింత రుచిగా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ సాస్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఇంట్లోనే పిజ్జా సాస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పిజ్జా సాస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పండిన ట‌మాటాలు – 4 ( పెద్ద‌వి), నూనె – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి త‌రుగు – ఒక టీ స్పూన్, సోంపుగింజ‌లు – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన క్యాప్సికం ముక్క‌లు – ఒక టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, ఒర‌గానో – అర టీ స్పూన్, కాశ్మీరి చిల్లీ కారం – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, పంచ‌దార – అర టీ స్పూన్.

Pizza Sauce recipe in telugu make in this method
Pizza Sauce

పిజ్జా సాస్ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో నీటిని తీసుకుని బాగా మ‌రిగించాలి. నీరు మ‌రిగిన త‌రువాత ట‌మాటాలు వేసి 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ ట‌మాటాల‌ను చ‌ల్ల‌టి నీటిలో వేసి వాటిపై ఉండే పొట్టును తీసి వేయాలి. త‌రువాత ఇందులో నుండి 3 ట‌మాటాల‌ను తీసుకుని జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత మిగిలిన ట‌మాటాను చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక వెల్లుల్లి త‌రుగు, సోంపుగింజ‌లు, క్యాప్సికం ముక్క‌లు, రెడ్ చిల్లీ ప్లేక్స్, ఒర‌గానో వేసి వేయించాలి.

ఇవి వేగిన త‌రువాత ట‌మాట పేస్ట్, ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత కారం, ఉప్పు, పంచ‌దార వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌రో 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పిజ్జా సాస్ త‌యార‌వుతుంది. దీనిని గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల నెల‌రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా ఇంట్లోనే త‌యారు చేసుకున్న పిజ్జా సాస్ తో చేసిన పిజ్జా కూడా చాలా రుచిగా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

D

Recent Posts