Pooja Hegde : పూజా హెగ్డె ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈమె నటిస్తున్న సినిమాలు అన్నీ హిట్ అవుతుండడంతో.. ఈమె తన రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసింది. అయితే అంత వరకు ఓకే. కానీ షూటింగ్‌కు వచ్చే సమయంలో తన వెంట ఎక్కువ సంఖ్యలో సిబ్బందిని తీసుకువస్తూ వారి ఖర్చులను కూడా నిర్మాతలపై వేస్తోంది. దీంతో ఈమెతో సినిమాలు చేయాలంటేనే నిర్మాతలు భయపడడం మొదలు పెట్టారు. ఈ మధ్య కాలంలో ఈ వార్త వైరల్ అయింది.
ఇక తాజాగా ఈమె మహేష్ బాబుతో కలిసి సినిమా చేస్తున్నానని అనేక సార్లు మహేష్ అని మాట్లాడింది. ఆయనను సర్ అనలేదు. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్ లాంటి వ్యక్తికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా.. అని ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇక ఇప్పుడు రాధే శ్యామ్ ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా పూజా హెగ్డె నోరు జారింది. దీంతో నెటిజన్లు ఆమెను ఆడుకుంటున్నారు.
తన జీవితం ఇంత విజయవంతంగా ఎలా మారిందని అందరూ అడుగుతుంటారని పూజా హెగ్డె తెలియజేసింది. రాధేశ్యామ్ ప్రమోషనల్ కార్యక్రమంలో ఆమె ఈ కామెంట్స్ చేసింది. అయితే ఈ కామెంట్స్ చేసే సమయంలో టంగ్ స్లిప్ అయింది. తన శృంగార జీవితం అని ఇంగ్లిష్‌లో మాట్లాడింది. వెంటనే జరిగిన తప్పు తెలుసుకుని.. తన జీవితం.. అని మాటలు మార్చి మాట్లాడింది. దీంతో ఆమె పొరపాటున అన్న మాటలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పూజా హెగ్డె మరోమారు వార్తల్లో నిలిచింది.