Pudina Pappu : పుదీనా ప‌ప్పు త‌యారీ ఇలా.. అన్నంలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది..!

Pudina Pappu : వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని, వాస‌న‌ను అందించ‌డానికి మ‌నం వంట‌ల్లో పుదీనాను విరివిరిగా వాడుతూ ఉంటాము. అలాగే పుదీనాతో పుదీనా ప‌చ్చ‌డి, పుదీనా రైస్, పులావ్ వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అయితే ఇవే కాకుండా పుదీనాతో మ‌నం ప‌ప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పుదీనాతో ప‌ప్పు ఏంటి అనుకుంటున్నారా.. ఇత‌ర ఆకుకూర‌ల‌తో చేసిన‌ట్టు మ‌నం పుదీనాతో ప‌ప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌ప్పును త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఈ ప‌ప్పు చాలా రుచిగా, క‌మ్మ‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఎంతో రుచిగా ఉండే ఈ పుదీనా ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనా దాల్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెస‌ర‌ప‌ప్పు – ఒక క‌ప్పు, నెయ్యి – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఆవాలు -అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఇంగువ – రెండు చిటికెలు, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ – పెద్ద‌ది ఒక‌టి, ప‌సుపు – పావు టీ స్పూన్, పుదీనా ఆకులు – 50 గ్రాములు, కారం – ఒక‌టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – 150 ఎమ్ఎల్, నిమ్మ‌ర‌సం – 2 టేబుల్ స్పూన్స్.

Pudina Pappu recipe in telugu make in this method
Pudina Pappu

పుదీనా దాల్ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో పెస‌ర‌ప‌ప్పును వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని గిన్నెలోకి తీసుకుని త‌గిన‌న్ని నీళ్లు పోసి మ‌రీ మెత్త‌గా కాకుండా ఉడికించుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ‌, మిన‌ప‌ప్పు వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఉల్లిపాయ ముక్క‌లు ప‌చ్చి వాస‌న పోయిన త‌రువాత పుదీనా ఆకులు వేసి వేయించాలి. త‌రువాత కారం, ఉప్పు వేసి క‌ల‌పాలి.

వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత ఉడికించిన ప‌ప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ప‌ప్పు ఉడుకుప‌ట్టిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి నిమ్మ‌ర‌సం క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పుదీనా దాల్ త‌యార‌వుతుంది. అన్నం, చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో తింటే ఈ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. పుదీనాతో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా రుచిగా ప‌ప్పును కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts