Pushpa Movie : అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ.. పుష్ప. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. డిసెంబర్ 17న ఈ మూవీ విడుదల కాగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప మూవీని మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రమంలోనే తక్కువ సమయంలోనే ఈ మూవీ రూ.300 కోట్ల ట్రేడ్ మార్క్‌ను సాధించింది. విజయవంతంగా దూసుకుపోతూనే ఉంది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ గెటప్‌తోపాటు నటనకు ప్రేక్షకులు మంత్ర ముగ్ధులు అయ్యారు. అయితే సినిమా ప్రేక్షకులకు చిత్ర యూనిట్ శుభ వార్తను చెప్పింది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ నెల 7వ తేదీన పుష్ప సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయం విదితమే. దీంతో సంక్రాంతి బరిలో నిలిచిన కొన్ని మూవీలు తప్పుకున్నాయి. వేసవిలో ఆ మూవీలు విడుదల కానున్నాయి. అయితే సంక్రాంతి బరిలో మూవీలు లేవు కనుక పుష్ప మూవీని ఓటీటీలో ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో జనవరి 7న పుష్ప సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అల్లు అర్జున్ అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు.