Locker Box : ప్రస్తుత తరుణంలో డబ్బు సంపాదించడం అన్న విషయం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. డబ్బు సంపాదించడం చాలా సమస్యగా మారింది. దీంతో చాలా మంది ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే మనం వాస్తు ప్రకారం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా మన ఇంట్లో ధనం నిలవదు. ముఖ్యంగా కొందరు డబ్బు, నగలు ఉంచే లాకర్లను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. కానీ అలా పెట్టడం వల్ల నష్టమే జరుగుతుంది. ఉన్న డబ్బు అంతా ఖర్చయిపోతుంది. అన్నీ నష్టాలే వస్తాయి. కనుక ఇంట్లో లాకర్లను ఎక్కడ పడితే అక్కడ పెట్టరాదు. వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్న ప్రకారం ఇంట్లో ఒక వైపున లాకర్ బాక్స్‌ను పెట్టడం వల్ల మాత్రమే ధనం లభిస్తుంది. ఇక వారు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
డబ్బు, నగలు ఉంచే లాకర్ బాక్స్ ను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ముఖ్యంగా తూర్పు వైపు అసలు పెట్టరాదు. ఈ దిక్కుకు సూర్యుడు, ఇంద్రుడు అధిపతులు. కనుక ఈ వైపున ఖాళీగా ఉంచాలి. లాకర్ కాదు.. అసలు ఏ వస్తువులను ఈ వైపున ఉంచరాదు. ఇక పశ్చిమం దిక్కున కూడా లాకర్‌లను పెట్టరాదు. ఈ వైపు టాయిలెట్ లేదా బాత్‌రూమ్‌లను నిర్మించుకోవాలి.
దక్షిణ దిశను ఖాళీగా ఉంచరాదు. ఏదో ఒక వస్తువును పెట్టాలి. అయితే లాకర్ బాక్స్‌ను పెట్టరాదు. అలాగని టాయిలెట్‌ను నిర్మించరాదు. వేరే ఏవైనా వస్తువులను ఉంచాలి. ఇక లాకర్ బాక్స్‌ను పెట్టేందుకు ఉత్తరం దిక్కు అనువైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉత్తరం దిక్కుకు కుబేరుడు అధిపతి. ఈ వైపున లాకర్ బాక్స్‌ను ఉంచడం వల్ల కుబేరుడు, లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఈ దిశలో లాకర్ బాక్స్ లేదా ఏదైనా కప్‌బోర్డ్‌లో ధనం, నగలు, ఇతర విలువైన వస్తువులను పెట్టుకోవచ్చు. దీంతో వాస్తు దోషం ఉండదు. ధనం బాగా సంపాదిస్తారు. సంపద సిద్ధిస్తుంది. ఆర్థిక సమస్యలు పోతాయి. కాబట్టి లాకర్ బాక్స్‌ను పెట్టే విషయంలో ఈ జాగ్రత్తలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అప్పుడే ఎలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి.