Radhe Shyam First Review : ప్రభాస్, పూజా హెగ్డెలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష రీతిలో ఆదరణ లభిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ వచ్చేసింది.
రాధేశ్యామ్ చిత్రాన్ని చూసిన ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్, సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు రాధే శ్యామ్‌పై అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ ఇచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం.. రాధేశ్యామ్ చిత్రం ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకువెళ్లి అబ్బురపరుస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి హిట్ కొడతారని అర్థమవుతోంది.
ఉమైర్ సంధు తెలిపిన ప్రకారం.. రాధే శ్యామ్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. దీంతో సినిమా విజువల్ వండర్‌గా ఉంటుంది. ప్రభాస్, పూజా హెగ్డెల మధ్య ఉన్న కెమిస్ట్రీ ఒక రేంజ్‌లో ఉంటుంది. క్లైమాక్స్ అయితే ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. అలాగే ప్రభాస్ నటన కూడా అబ్బుర పరుస్తుంది. ఈ క్రమంలోనే ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గతంలో ఉమైర్ సంధు పలు చిత్రాలకు ఇలాగే రివ్యూలు ఇచ్చారు. ఆయన చెప్పినట్లే కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే రాధేశ్యామ్‌కు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు కనుక ఈ మూవీ కూడా హిట్ అవుతుందని అంటున్నారు. మరి రాధేశ్యామ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.