Rajma Pakoda : రాజ్మా పకోడీలను ఎప్పుడైనా తిన్నారా.. రుచి అద్భుతం.. తయారీ ఇలా..

Rajma Pakoda : ముదురు ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉండే రాజ్మా గింజల గురించి చాలా మందికి తెలుసు. వీటిని నీటిలో కొన్ని గంటల పాటు నానబెట్టి తరువాత వీటిని ఇతర కూరగాయలతో కలిపి వండుతుంటారు. రాజ్మాను ఎలా వండినా కూడా చాలా రుచిగా ఉంటుంది. రాజ్మా కర్రీ చేస్తే చపాతీలతో రుచి భలేగా ఉంటుంది. అయితే రాజ్మాతో ఎంతో రుచికరమైన పకోడీలను కూడా తయారు చేయవచ్చు. వీటిని చేయడం కూడా సులభమే. రుచిగా కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే రాజ్మా పకోడీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాజ్మా పకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు..

రాజ్మా – పావు కిలో, సన్నగా తరిగిన టమాటాలు – రెండు టేబుల్‌ స్పూన్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు – 50 గ్రాములు, పచ్చి మిర్చి – రెండు, సన్నగా తరిగిన కొత్తిమీర – రెండు టీస్పూన్లు, నిమ్మరసం – రెండు టీస్పూన్లు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి – అర టీస్పూన్‌ చొప్పున, ఓట్స్‌ – 50 గ్రాములు, బ్రెడ్‌ పొడి – 30 గ్రాములు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి తగినంత.

Rajma Pakoda very easy to make tasty recipe
Rajma Pakoda

రాజ్మా పకోడీలను తయారు చేసే విధానం..

రాజ్మా గింజలను రాత్రంతా నానబెట్టి ఉంచుకోవాలి. నానిన రాజ్మా గింజలని కుక్కర్‌లో మెత్తగా ఉడికించుకుని ఈ మిశ్రమంలో ఓట్స్‌, బ్రెడ్‌ పొడి తప్పించి మిగిలిన అన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చివరిగా ఓట్స్‌, బ్రెడ్‌ పొడిలో వేసి దొర్లించుకోవాలి. వీటిని నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. పుదీనా చట్నతో తింటే భలే రుచిగా ఉంటుంది. ఇలా చేసిన రాజ్మా పకోడీలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
Editor

Recent Posts