Valimai : తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించిన వలిమై చిత్రం ఫిబ్రవరి 24వ తేదీన థియేటర్లలో భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది.
వలిమై చిత్రానికి గాను జీ5 సంస్థ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. దీంతో ఆ యాప్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది. ఈ నెల 25వ తేదీన ఈ మూవీని జీ5 యాప్‌లో స్ట్రీమ్ చేయనున్నారు. జీ5 యాప్‌లో ఈ సినిమాకు చెందిన తమిళ, తెలుగు వెర్షన్‌లను స్ట్రీమ్ చేస్తారు.
అయితే అదే రోజు భీమ్లా నాయక్ చిత్రం కూడా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. హాట్ స్టార్‌తోపాటు ఆహాలోనూ ఈ మూవీని స్ట్రీమ్ చేయనున్నారు. ఇక ఇదే తేదీ రోజు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదలవుతోంది. దీంతో ఈ శుక్రవారం ప్రేక్షకులకు కావల్సినంత వినోదం లభ్యం కానుంది.