Rashmika Mandanna : క్యూట్ లుక్స్‌తో ర‌ష్మిక మంద‌న్న‌.. పాట‌కు డ్యాన్స్ చేసి అల‌రించింది.. వీడియో..!

Rashmika Mandanna : పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో మ‌రింత స్టార్‌డ‌మ్‌ను సంపాదించింది.. ర‌ష్మిక మంద‌న్న‌. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఆమెకు చేతినిండా సినిమాలు ఉన్నాయి. ప‌లు బాలీవుడ్ సినిమాల్లో ఆమె న‌టిస్తోంది. అయితే సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండే ర‌ష్మిక మందన్న త‌ర‌చూ త‌న‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను షేర్ చేస్తుంటుంది. ప‌లు బ్రాండ్స్‌ను ప్ర‌మోట్ చేస్తుంటుంది. ఇక తాజాగా ఆమె ఓ పాట‌కు డ్యాన్స్ చేసి అల‌రించింది.

Rashmika Mandanna danced for an English song viral video
Rashmika Mandanna

ఓ ఇంగ్లిష్ పాట‌కు ర‌ష్మిక మందన్న త‌న‌దైన శైలిలో డ్యాన్స్ చేసి అల‌రించింది. ఆ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయ‌గా.. అది వైర‌ల్ గా మారింది. అందులో ర‌ష్మిక క్యూట్ లుక్స్ ఎంతో ఆక‌ట్టుకుంటున్నాయి.

ఇక ఈమె ప్ర‌స్తుతం పుష్ప 2 సినిమాలో త్వ‌ర‌లో న‌టించ‌నుంది. ఈమె ఇటీవ‌ల న‌టించిన ఆడ‌వాళ్లు మీకు జోహార్లు మూవీ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఇందులో శ‌ర్వానంద్ హీరోగా న‌టించాడు. ఇక మిష‌న్ మ‌జ్ను, గుడ్ బై అనే హిందీ సినిమాల్లోనూ ర‌ష్మిక న‌టిస్తోంది. ఈ మూవీలు త్వ‌ర‌లో విడుద‌ల కానున్నాయి.

Editor

Recent Posts