business

జియో నుంచి స‌రికొత్త 98 రోజుల వాలిడిటీ ప్లాన్‌.. వివ‌రాలు ఇవే..!

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల కోసం ఓ సరికొత్త ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. రూ.999 పేరిట విడుద‌లైన ఈ ప్లాన్‌ను క‌స్ట‌మ‌ర్లు రీచార్జి చేసుకుంటే వారికి 98 రోజుల వాలిడిటీ ల‌భిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా క‌స్ట‌మ‌ర్లు అన్‌లిమిటెడ్ 5జి డేటాను కూడా పొంద‌వ‌చ్చు.

రూ.1000 ల‌భిస్తున్న చ‌వ‌కైన ప్లాన్ ఇదే కాగా.. దీంట్లో క‌స్ట‌మ‌ర్ల‌కు 98 రోజుల మేర వాలిడిటీ ల‌భిస్తుంది. రోజుకు 2జీబీ డేటా వ‌స్తుంది. 100 ఎస్ఎంఎస్‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. దీంతో మొత్తం వాలిడిటీకి గాను 196 జీబీ డేటాను వాడుకోవ‌చ్చు. ఇక ఈ ప్లాన్ ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌కు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి యాప్‌ల‌కు గాను ఉచిత స‌బ్‌స్క్రిప్ష‌న్ ల‌భిస్తుంది.

reliance jio launched 98 days validity plan know the details

అయితే రూ.999 ప్లాన్‌తోపాటు రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా క‌స్ట‌మ‌ర్ల‌కు అందుబాటులో ఉంది. ఇందులోనూ క‌స్ట‌మ‌ర్లు రోజుకు 2 జీబీ డేటాను పొంద‌వ‌చ్చు. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజులుగా ఉంది. దీంతో మొత్తం 200 జీబీ వ‌ర‌కు డేటాను పొంద‌వ‌చ్చు. అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్‌తోపాటు పైన తెలిపిన ప్లాన్‌లోని ఇత‌ర బెనిఫిట్స్ కూడా ఈ ప్లాన్‌లో వ‌స్తాయి. ఇక ఈ ప్లాన్ల‌ను వినియోగ‌దారులు జియో యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా రీచార్జి చేసుకోవచ్చు.

Admin

Recent Posts