lifestyle

కేవ‌లం నిద్ర‌పోవ‌డం వ‌ల్లే రూ.9 ల‌క్ష‌లు గెలుచుకున్న మ‌హిళ‌..!

సాధార‌ణంగా మ‌నం నిద్ర‌పోతే మ‌న శ‌రీరం మ‌ర‌మ్మ‌త్తుల‌కు గురై త‌న‌కు తాను రిపేర్ చేసుకుంటుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటాం. అయితే కేవ‌లం నిద్ర‌పోవ‌డం వల్లే డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చ‌న్న విష‌యం మీకు తెలుసా..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. కేవ‌లం నిద్ర‌పోవ‌డం వ‌ల్ల ఆ కంపెనీ వారు డ‌బ్బు ఇస్తారు. అలా ఆ మ‌హిళ ఏకంగా రూ.9 ల‌క్ష‌ల‌ను సంపాదించింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బెంగ‌ళూరుకు చెందిన సాయీశ్వ‌రీ పాటిల్ అనే మ‌హిళ ఈమ‌ధ్యే వేక్‌ఫిట్ అనే స్టార్ట‌ప్ వారు నిర్వహించిన 3వ సీజ‌న్ స్లీప్ ఇంట‌ర్న్ షిప్ ప్రోగ్రామ్‌లో పాల్గొంది. మ‌రో 11 మందితో ఆమె పోటీ ప‌డింది. దీంతో విజేత‌గా నిలిచింది. ఈ క్ర‌మంలోనే ఆమె రూ.9 ల‌క్ష‌ల‌ను గెలుచుకుంది. ఇందులో పాల్గొన్న వారు రోజుకు త‌గిన‌న్ని గంట‌ల పాటు ఆ కంపెనీ వారు ఇచ్చే ప‌రుపుల‌పై నిద్రించాల్సి ఉంటుంది. వారి నిద్ర‌కు ట్రాక్ చేయ‌డానికి ఒక ట్రాక‌ర్‌ను కూడా చేతికి అమ‌రుస్తారు. ఈ విధంగా ఎవ‌రు బాగా నిద్రిస్తే వారు ఈ ప్రైజ్ మనీ గెలుచుకుంటారు.

woman won rs 9 lakh prize money just for sleeping

ఇక వేక్‌ఫిట్ కంపెనీ ఈ మ‌ధ్య ఇలాంటి ప్రోగ్రామ్‌ల‌ను త‌ర‌చూ నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు ఇందులో భాగంగా కొన్ని ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను గెలుచుకున్నారు. అయితే యువ‌త‌లో నిద్ర క‌రువ‌వుతోంది, అనేక మంది నిద్ర‌లేమితో బాధ‌ప‌డుతున్నార‌ని, క‌నుక అలాంటి వారిలో అవ‌గాహ‌న క‌ల్పించేందుకే ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని మ‌రోవైపు వేక్ ఫిట్ తెలిపింది.

Admin

Recent Posts